డబుల్ బెడ్ రూం ఇళ్లతో టీఆర్ఎస్ కంటే మాకే ఎక్కువ లాభం.. కిషన్ రెడ్డి..

By AN TeluguFirst Published Oct 27, 2020, 9:44 AM IST
Highlights

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఎన్ని ఎక్కువ ఇస్తే రాజకీయంగా తమకు అంత ఎక్కువ లాభం చేకూరుతుందని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం దిల్‌కుషా గెస్ట్‌హౌస్ లో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఎన్ని ఎక్కువ ఇస్తే రాజకీయంగా తమకు అంత ఎక్కువ లాభం చేకూరుతుందని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం దిల్‌కుషా గెస్ట్‌హౌస్ లో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఒక బస్తీలో ఐదారు వందల మంది అర్హులు ఉంటే.. వంద మందికి కూడా డబుల్ బెడ్ రూం ఇళ్లు రావట్లేదు. వచ్చినోళ్లు సంతోషంగా ఉంటారు. రానివారికి కడుపుమంట ఉంటుంది. అది మాకు అనుకూలమవుతుంది’ అని వ్యాఖ్యానించారు. 

దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగ మంత్రి హరీష్ రావు బీజేపీ మీద పదే పదే చిరాకు పడుతున్నాడని అదే బీజేపీ విజయానికి సంకేతమని తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు బీజేపీకి ప్రచారం చేయడాన్ని మంత్రి హరీశ్‌రావు తట్టుకోలేకపోతున్నారని అన్నారు. 

వరద బాధితులకు విరాళాల కోసం సినీరంగ ప్రముఖులకు ఒక మంత్రి ఫోన్‌ చేస్తున్నారంటూ జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ వెల్లడించిన విషయాన్ని ప్రస్తావించగా, ‘మంత్రే కాదు.. స్వయంగా ముఖ్యమంత్రే వ్యాపారవేత్తలకు పిలుపునిచ్చారు కదా! రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం’ అని కిషన్‌రెడ్డి అన్నారు. 

వరద నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ సమగ్ర నివేదిక ఇవ్వలేదని, అది ఇవ్వగానే కేంద్ర సాయం విడుదలవుతుందన్నారు. చివరగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీపై పార్టీలో చర్చ జరగలేదని ఆయన చెప్పారు. 

click me!