తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు .. రేపు హైదరాబాద్‌కు రానున్న ఈసీ బృందం , ఏర్పాట్లపై సమీక్ష

By Siva Kodati  |  First Published Oct 31, 2023, 9:51 PM IST

బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం బృందం తెలంగాణకు రానుంది. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమీషనర్లు నితీష్ వ్యాస్, ధర్మేంద్ర శర్మలతో కూడిన బృందం రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటించనుంది. ఈ సందర్భంగా ఎన్నికల ఏర్పాట్లను ఈ బృందం పరిశీలించనుంది.


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. ఈ నెలాఖరులో పోలింగ్ వుండటంతో ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం బృందం తెలంగాణకు రానుంది. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమీషనర్లు నితీష్ వ్యాస్, ధర్మేంద్ర శర్మలతో కూడిన బృందం రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటించనుంది. ఈ సందర్భంగా ఎన్నికల ఏర్పాట్లను ఈ బృందం పరిశీలించనుంది. తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్, తదితర అధికారులతో సమావేశం కానుంది. అలాగే సీఎస్, డీజీపీ సహా ఇతర ఉన్నతాధికారులతోనూ సీఈసీ బృందం భేటీ కానుంది. 

ఇకపోతే.. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న తనిఖీలు, స్వాధీనాలపైనా ఈసీ బృందం సమీక్షించనుంది. తెలంగాణకు పొరుగున వున్న సీఎస్‌లు, డీజీపీలు, ఇతర అధికారులతో గురువారం ఎన్నికల సంఘం బృందం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఎన్నికలు సజావుగా సాగేందుకు గాను తీసుకోవాల్సిన చర్యలు, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలు, చెక్‌పోస్టుల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించనున్నారు. 

Latest Videos

undefined

కాగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఇటీవల ప్ర‌కటించింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 10న నామినేషన్లకు చివరి తేదీ కాగా, నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.17 కోట్లు కాగా, పురుషులు, మహిళలు సమాన నిష్పత్తిలో ఉన్నారు. ఇక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమ‌లు నేప‌థ్యంలో ప‌లు ఆంక్ష‌లు కొన‌సాగుతాయి. 

ALso Read: Telangana Assembly Elections 2023: మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుతో ఏం జ‌రుగుతుంది..?

నగదు తీసుకెళ్లే వ్యక్తులు సరైన డాక్యుమెంట్లను అధికారులకు సమర్పించాలని వికాస్ రాజ్ చెప్పారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు స్టాటిక్ లేదా వెహికల్ మౌంటెడ్ లౌడ్ స్పీకర్లను అనుమతించరు. ఎలక్ట్రానిక్ మీడియాలో లేదా ఇతరత్రా జారీ చేయాలని ప్రతిపాదించిన అన్ని రాజకీయ ప్రకటనలకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) ప్రీ సర్టిఫికేషన్ పొందాల్సి ఉంటుంది.

ఓటర్లకు లంచం ఇవ్వడం, ఓటర్లను బెదిరించడం, ఓటర్లను తారుమారు చేయడం, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ప్రచారం చేయడం, పోలింగ్ ముగియడానికి నిర్ణయించిన గంటతో ముగిసే 48 గంటల వ్యవధిలో బహిరంగ సభలు నిర్వహించడం వంటి అవినీతి కార్యకలాపాలు, ఎన్నికల చట్టం ప్రకారం నేరాలకు అన్ని పార్టీలు, అభ్యర్థులు దూరంగా ఉండాలి. రాజకీయ పార్టీలు లేదా అభ్యర్థులు అతని రాజకీయ అభిప్రాయాలను లేదా కార్యకలాపాలను ఎంతగా వ్యతిరేకించినా, శాంతియుతమైన-ఎటువంటి ఆటంకం లేని గృహ జీవితం కోసం ప్రతి వ్యక్తి  హక్కు గౌరవించబడుతుంది. 

click me!