కేసీఆర్ మూడోసారి సీఎం అయితే ఇంకో లక్ష కోట్లు సంపాదిస్తారు .. ఈసారి మనవడికి పదవి : రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Oct 31, 2023, 8:46 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి . కేసీఆర్ మూడోసారి సీఎం అయితే ఇంకో లక్ష కోట్లు సంపాదిస్తారని ఆరోపించారు.  దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్ధిని ఎవరో కత్తితో పొడిస్తే.. కాంగ్రెస్ మీద నెపం మోపుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మంగళవారం కొల్లాపూర్ నియోజకవర్గంలో ‘‘పాలమూరు ప్రజాభేరి’’ సభలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ మూడోసారి సీఎం అయితే ఇంకో లక్ష కోట్లు సంపాదిస్తారని ఆరోపించారు. ఆయన ఇంట్లో నలుగురు వుంటే నాలుగు పదవులు ఇచ్చారని.. మూడోసారి గెలిస్తే వాళ్ల మనవడికి కూడా పదవులు ఇస్తారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ఈసారి అధికారం ఇవ్వాలంటూ ఆయన అభ్యర్ధించారు. 

పాలమూరును పసిడి పంటల జిల్లాగా మార్చాలంటే మనవాడే కీలక పదవిలో వుండాలని.. తనకు సోనియా పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. మా ఆరు గ్యారెంటీలే.. మా అభ్యర్ధులు అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ వస్తే రైతుబంధు రాదు అని కేసీఆర్ అంటున్నారని.. భూమి లేని వాళ్లకు 12 వేలు , రైతులకు 15 వేలు ఇస్తానని సోనియా చెప్పింది వినలేదా అంటూ రేవంత్ రెడ్డి నిలదీశారు.

Latest Videos

undefined

ALso Read: కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదు .. బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర.. ఎంఐఎం సాయం : కొల్లాపూర్‌లో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు

దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్ధిని ఎవరో కత్తితో పొడిస్తే.. కాంగ్రెస్ మీద నెపం మోపుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కత్తులతో పొడిచేవాళ్లమే అయితే నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు తిరిగే వాళ్లా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన గాంధీ కుటుంబాన్ని చిల్లరగా మాట్లాడితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. 

click me!