హైద్రాబాద్‌కు చేరుకున్న సీఈసీ బృందం: రాజకీయ పార్టీలతో భేటీ

By narsimha lode  |  First Published Oct 3, 2023, 3:31 PM IST

తెలంగాణకు  సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం మంగళవారంనాడు చేరుకుంది. 
 



హైదరాబాద్: సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం  మంగళవారంనాడు హైద్రాబాద్ కు చేరుకుంది.   మూడు రోజుల పాటు సీఈసీ బృందం పర్యటించనుంది. తెలంగాణలో ఎన్నికల సన్నద్దతపై  సమీక్షించనుంది. ఇవాళ మధ్యాహ్నం సీఈసీ రాజీవ్ కుమార్ సహా  కేంద్ర ఎన్నికల సంఘం  ప్రతినిధి బృందం హైద్రాబాద్ కు చేరుకుంది.  హైద్రాబాద్ లోని హోటల్ లో  సీఈసీ బృందం బస చేయనుంది.   తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి  సీఈసీ బృందం  సమీక్ష నిర్వహించనుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్రంలో జరిగిన ఏర్పాట్లపై  ఈసీ అధికారులు  సమీక్షించనున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి  చేసిన ఏర్పాట్లపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల  ప్రధానాధికారి వికాస్ రాజ్ సీఈసీ బృందానికి  పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇవ్వనున్నారు. 

తెలంగాణలో  ఎన్నికల నిర్వహణకు సంబంధించి  రాజకీయ పార్టీలతో  సీఈసీ టీమ్  ఇవాళ భేటీ కానుంది. పది గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు  ఆహ్వానం పంపారు అధికారులు. ఒక్కో పార్టీ నుండి ముగ్గురు ప్రతినిధులు  ఈ సమావేశానికి హాజరు కానున్నారు. మరో వైపు ఎన్‌ఫోర్స్ మెంట్ ఏజెన్సీలతో  కూడ సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం సమావేశం కానుంది. ఎన్నికల సమయంలో  మద్యం,  డబ్బు పంపిణీని అడ్డుకొనే విషయమై  చర్చించనున్నారు.  మరో వైపు  రాజకీయ పార్టీల ప్రతినిధులతో కూడ  కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు చర్చించారు.  పార్టీలతో విడి విడిగా ఈసీ ప్రతినిధులు చర్చించారు.

Latest Videos

undefined

also read:నేటి నుండి మూడు రోజుల పాటు తెలంగాణలో సీఈసీ బృందం పర్యటన: ఎన్నికల సన్నద్దతపై సమీక్ష

రేపు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో  సీఈసీ బృందం భేటీ కానుంది. ఎల్లుండి దివ్యాంగ ఓటర్లకు ఏర్పాట్ల విషయమై సమీక్ష నిర్వహించనున్నారు.మూడో రోజున  మీడియాతో కేంద్ర ఎన్నికల సంఘం  ప్రతినిధులు మాట్లాడే అవకాశం ఉంది.

click me!