తప్పుడు బిల్లులతో రూ. 1.20 కోట్లు డ్రా:నీలోఫర్ డైట్ కాంట్రాక్టర్ సురేష్ బాబు అరెస్ట్

Published : Jul 05, 2021, 06:18 PM IST
తప్పుడు బిల్లులతో రూ. 1.20 కోట్లు డ్రా:నీలోఫర్ డైట్ కాంట్రాక్టర్ సురేష్ బాబు అరెస్ట్

సారాంశం

నీలోఫర్ డైట్ కాంట్రాక్టర్ సురేష్ బాబు  ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.  తప్పుడు బిల్లులతో రూ. 1.20 కోట్లు కాజేశారనే ఫిర్యాదుపై  పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

హైదరాబాద్:నీలోఫర్ డైట్ కాంట్రాక్టర్ సురేష్ బాబు  ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.  తప్పుడు బిల్లులతో రూ. 1.20 కోట్లు కాజేశారనే ఫిర్యాదుపై  పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.తప్పుడు బిల్లులతో  డైట్ కాంట్రాక్టర్ సురేష్ బాబు రూ. 1.20 కోట్లు కాజేశారని  నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండ్  పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు సురేష్ బాబును అరెస్ట్ చేశారు.

నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స కు ఆసుపత్రిలో చేరిన పిల్లలకు పౌష్టికాహరం అందించకుండా తప్పుడు బిల్లులు సృష్టించారని  సీసీఎస్ పోలీసులకు సూపరింటెండ్ ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్ ఇచ్చిన బిల్లులపై పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. ఎంత కాలం నుండి ఈ రకంగా బిల్లులతో డబ్బులు క్లైయిమ్ చేస్తున్నాడనే విషయమై పోలీసులు ఆరా తీయనున్నారు.

నీలోఫర్ డైట్ కాంట్రాక్టర్ సురేష్ బాబుపై చర్యలు తీసుకోవాలని గత ఏడాదిలో తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. డైట్ కాంట్రాక్టర్ సురేష్ బాబు వ్యవహరంపై కొందరు కోర్టును ఆశ్రయించడంతో ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.  


 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?