విద్యుత్ ఉత్పత్తిపై జగన్ ప్రతిపాదనకు కేసీఆర్ సర్కార్ నో

By narsimha lodeFirst Published Jul 5, 2021, 3:54 PM IST
Highlights

ఈ నెల 9వ తేదీన తలపెట్టిన కేఆర్ఎంబీ త్రిసభ్యకమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని కేఆర్ఎంబీకి  తెలంగాణ ప్రభుత్వం సోమవారం నాడు లేఖ రాసింది. ఈ నెల 20వ తేదీ తర్వాత పూర్తిస్థాయిబోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆ లేఖలో కోరింది. 

హైదరాబాద్: ఈ నెల 9వ తేదీన తలపెట్టిన కేఆర్ఎంబీ త్రిసభ్యకమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని కేఆర్ఎంబీకి  తెలంగాణ ప్రభుత్వం సోమవారం నాడు లేఖ రాసింది. ఈ నెల 20వ తేదీ తర్వాత పూర్తిస్థాయిబోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆ లేఖలో కోరింది. 

also read:విచారించొద్దు: కృష్ణా జలాల వివాదంపై ఏపీ రైతుల పిటిషన్‌పై తెలంగాణ ఏజీ

కృష్ణా నది జలాలను పున:సమీక్షించాలని కూడ ఆ లేఖలో కోరింది. ఈ నెల 9వ తేదీన కేఆర్ఎంబీ  త్రిసభ్య కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.   ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కేఆర్ఎంబీని కోరింది. ఈ విషయమై రెండు దఫాలు కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖలు రాసింది.  

విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వ వాదనను తెలంగాణ తోసిపుచ్చింది. ఇదే విషయమై ఏపీ సీఎం వైఎస్ జగన్  ప్రధాని మోడీకి, కేంద్ర జల్ శక్తి మంత్రికి గతంలో లేఖలు రాశారు. మరో వైపు ఇవాళ కూడ మరోసారి కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ కు కూడ జగన్ లేఖలు రాశారు.
 

click me!