ఆ స్థలాన్ని సందర్శించండి: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై ఎన్జీటీకి తెలంగాణ

By narsimha lodeFirst Published Jul 5, 2021, 4:50 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలిపివేయాలని కోరుతూ  గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది తెలంగాణ సర్కార్. ఈ మేరకు సోమవారం నాడు ఎన్జీటిలో కేసీఆర్ పిటిషన్ దాఖలు చేసింది.కృష్ణా నదిపై రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలిపివేయాలని కోరుతూ  గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది తెలంగాణ సర్కార్. ఈ మేరకు సోమవారం నాడు ఎన్జీటిలో కేసీఆర్ పిటిషన్ దాఖలు చేసింది.కృష్ణా నదిపై రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

also read:విద్యుత్ ఉత్పత్తిపై జగన్ ప్రతిపాదనకు కేసీఆర్ సర్కార్ నో

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిర్వహించే ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించాలని ట్రిబ్యునల్ సభ్యులను తెలంగాణ ప్రభుత్వం కోరింది. ట్రిబ్యునల్ సభ్యులు ఈ ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించేందుకు అయ్యే ఖర్చును తెలంగాణ ప్రభుత్వం భరిస్తోందని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసినా కూడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కొనసాగుతున్నాయని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. 

తమ ఆదేశాలకు విరుద్దంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను నిర్వహిస్తే జైలుకు పంపుతామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఆదిత్యనాథ్ దాస్ ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్  ను ఈ ఏడాది జూన్ 25న ఆదేశించింది.ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టవద్దని కూడ ఎన్జీటి గతంలోనే ఆదేశించింది. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త గవినోళ్ల శ్రీనివాస్  ఈ విషయమై ఎన్జీటీలో  పిటిషన్ దాఖలు చేశారు. 

click me!