లిక్కర్ కేసులో కవితకు సీబీఐ సమన్లు, వచ్చే వారం హాజరు కావాలి

By Mahesh K  |  First Published Feb 21, 2024, 10:24 PM IST

లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి సీబీఐ సమన్లు పంపింది. గతంలో డిసెంబర్‌లో సీబీఐ ఆమెను దర్యాప్తు చేసిన సంగతి తెలిసిందే.
 


MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ తనయ కవితకు సీబీఐ నుంచి మరోసారి సమన్లు అందాయి. వచ్చే వారం దర్యాప్తునకు హాజరు కావలని సీబీఐ సమన్లు పంపింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఈ సమన్లు వచ్చినట్టు కొన్ని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్సీ కవితకు సీబీఐ సమన్లు పంపడం ఇది రెండోసారి. గతంలో డిసెంబర్‌లో ఆమెను సీబీఐ విచారించిన విషయం విధితమే.

ఇక ఇదే కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా దర్యాప్తు చేస్తున్నది. విజయన్ నాయర్ అనే వ్యక్తికి సౌత్ గ్రూప్ అనే సంస్థ నుంచి రూ. 100 కోట్లు అందినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ సౌత్ గ్రూప్‌ను శరత్ రెడ్డడి, కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి కంట్రోల్ చేస్తున్నట్టు సమాచారం. ఆప్ లీడర్ల తరఫున ఈ సౌత్ గ్రూప్ డబ్బులు పంపినట్టు ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ఈడీ దర్యాప్తు చేస్తున్నది.

Latest Videos

Also Read: సింగిల్ ఓవర్‌లో ఆరు సిక్స్‌లు బాదిన ఆంధ్రా బ్యాట్స్‌మెన్.. వీడియో వైరల్

లిక్కర్ కేసులో ఈడీ దర్యాప్తు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ కవితను దాదాపుగా ఈడీ అరెస్టు చేస్తుందనే దాకా దర్యాప్తులు వెళ్లాయి. కానీ, అనూహ్యంగా ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించడం, ఆ తర్వాత పరిస్థితులు మారడంతో ఈడీ లిక్కర్ కేసు దర్యాప్తు కొంత మందగించింది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ హైలైట్ చేసి బీఆర్ఎస్, బీజేపీల మధ్య పొత్తు ఉన్నదని తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను తెలగాంణ సమాజంలోని చాలా మంది ఈ ఆరోపణలను నమ్మారు.

click me!