ఆంధ్రా బ్యాట్స్‌మెన్ వంశీ కృష్ణ క్రీజులో శివాలెత్తాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాది బౌలర్ పై జైత్రయాత్ర చేశాడు.  

Six Sixes: ఆంధ్ర బ్యాటర్ వంశీ క్రిష్ణ తన సత్తా చూపారు. బ్యాట్ ఝుళిపించి క్రికెట్ చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు. సింగిల్ ఓవర్‌లో ఆరు సిక్స్‌లు బాది తన పేరిట రికార్డు పదిలం చేసుకున్నారు. కడపలో సీకే నాయుడు ట్రోఫీ మ్యాచ్‌లో రైల్వేస్ పై మ్యాచ్ ఆడుతూ ఈ రికార్డు సృష్టించాడు. ఈ ఫీట్‌తో ఆయన ఏకంగా తన పేరును లెజెండరీ బ్యాట్స్‌మెన్ రవి శాస్త్రి, యువరాజ్ సింగ్, రుతురాజ్ గైక్వాడ్‌ల సరసన నిలుపుకున్నారు. 1985లో రవి శాస్త్రి, 2007లో యువరాజ్ సింగ్, 2022లో రుతురాజ్ గైక్వాడ్ ఈ రికార్డు సొంతం చేసుకున్నారు.

దమందీప్ సింగ్ బౌలింగ్‌లో వంశీ క్రిష్ణ బంతిని తుత్తునియలు చేశాడు. దమందీప్ సింగ్ బౌలిక్ పై జైత్రయాత్ర చేశాడు. ఆరు బంతులకు ఆరు సిక్సర్‌లు బాది బౌలర్‌కు చుక్కలు చూపించాడు. అన్ని సిక్స్‌లూ ఆన్ సైడ్ ఆడాడు. వంశీ క్రిష్ణ అద్భుత టైమింగ్, పవర్‌తో ఈ రికార్డు చేశాడు.

Scroll to load tweet…

మిడ్ వికెట్ గుండా తొలి బంతిని బౌండరీకి తరలించాడు. ఆ తర్వాత లాంగ్ ఆన్ మీదుగా.. అనంతరం.. ఇక సిక్స్‌ల వరదే సృష్టించాడు. 

ఒక వైపు వంశీ క్రిష్ణ మెరుపుదాడి చేసినా.. ఆంధ్రా వర్సెస్ రైల్వేస్ మ్యాచ్ చివరికి డ్రా గానే ముగిసింది. రైల్వే జ్టుట మొత్తం 378 పరుగులు చేసి ఫస్ట్ ఇన్నింగ్ ముగించుకుంది. కాగా, ఆంధ్రా తొమ్మిది వికెట్ల నష్టానికి 865 పరుగులు సాధించింది.