ఢిల్లీ లిక్కర్ స్కాం : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖకు సీబీఐ రిప్లై... డేట్ , టైం ఫిక్స్

By Siva KodatiFirst Published Dec 6, 2022, 5:37 PM IST
Highlights

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖకు సీబీఐ రిప్లయ్ ఇచ్చింది. ఈ నెల 11వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని కవిత నివాసంలో స్టేట్‌మెంట్ రికార్డు చేస్తామని సీబీఐ తెలిపింది. 

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖకు సీబీఐ సమాధానమిచ్చింది. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు సమావేశానికి అంగీకరించింది. వివరణ ఇచ్చేందుకు కవిత అడిగిన ఈ నెల 11, 12, 14, 15 వ తేదీల్లో 11వ తేదీకి సీబీఐ అంగీకరించింది. ఈ మెయిల్ ద్వారా ఈ మేరకు కవితకు సమాచారం ఇచ్చారు సీబీఐ అధికారులు. దీనిలో భాగంగా ఈ నెల 11న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని కవిత ఇంట్లో స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నారు సీబీఐ అధికారులు. 

ఇదిలావుండగా... ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సీబీఐ అధికారులు ఇటీవల కవితకు నోటీసులు  జారీ చేసిన సంగతి తెలిసిందే.  ఆమె సౌకర్యార్థం హైదరాబాద్‌లోని నివాసంలో గానీ, ఢిల్లీలోని నివాసంలో గానీ ఈ నెల 6వ తేదీన ఉదయం 11 గంటలకు విచారించాలని అనకుంటున్నామని చెప్పారు. విచారణ ప్రదేశాన్ని తెలియజేయాని కోరారు. అయితే దీనిపై స్పందించిన కవిత హైదరాబాద్‌లోని నివాసంలో విచారణ అధికారులకు సమాధానమిస్తానని చెప్పారు. అయితే  శనివారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో సమావేశం అనంతరం సీబీఐకి కవిత లేఖ రాశారు. 

Also REad:డిసెంబర్ 6వ తేదీన కలవలేను.. : సీబీఐకి కల్వకుంట్ల కవిత లేఖ..

ఢిల్లీ  లిక్కర్ స్కామ్‌పై వచ్చిన ఫిర్యాదు, ఎఫ్‌ఐఆర్ ప్రతులను ఇవ్వాలని లేఖలో సీబీఐని కవిత కోరారు. డాక్యుమెంట్లు ఇస్తే వేగంగా సమాధానాలు ఇచ్చేందుకు వీలవుతుందని  తెలిపారు. తనకు పత్రాలు అందిన తర్వాత హైదరాబాద్‌లో సమావేశ తేదీని ఖరారు చేయవచ్చని పేర్కొన్నారు. కవిత లేఖపై స్పందించిన సీబీఐ అధికారులు.. సీబీఐ వెబ్‌సైట్‌లో ఆ వివరాలు అందుబాటులో ఉన్నాయని ఈ-మెయిల్ ద్వారా కవితకు తెలియజేశారు. ఈ క్రమంలోనే వాటిని పరిశీలించిన కవిత.. తాజాగా మరోమారు సీబీఐకి లేఖ రాశారు. 

డిసెంబర్ 6వ తేదీన సీబీఐ అధికారులను కలవలేనని తెలిపారు. ముందుగా ఖరారైన కార్యక్రమాల కారణంగా హాజరుకాలేకపోతున్నట్టుగా చెప్పారు. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో విచారణకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఆ తేదీల్లో హైదరాబాద్‌లోని తన నివాసంలోనే అందుబాటులోనే ఉంటానని స్పష్టం చేశారు. అందులో ఏ తేదీ అనుకూలమో త్వరగా తెలియజేయాలని కోరారు. సీబీఐ వెబ్‌సైట్‌లో ఉన్న ఎఫ్‌ఐఆర్‌ను క్షుణం గా పరిశీలించానని చెప్పారు. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు లేదని పేర్కొన్నారు. అయితే తాను చట్టాన్ని గౌరవిస్తానని.. దర్యాప్తుకు సహకరిస్తానని చెప్పారు.

 

 

click me!