టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు: విచారణను రేపటికి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు

By narsimha lodeFirst Published Dec 6, 2022, 4:56 PM IST
Highlights

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు విచారణను  రేపటికి వాయిదా వేసింది  తెలంగాణ హైకోర్టు. ఈ కేసు విచారణను సీబీఐ లేదా స్వతంత్ర విచారణ సంస్థతో జరిపించాలని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారిస్తుంది. 
 

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును సీబీఐ  లేదా  స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలనే పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.ఈ కేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది. బీజేపీతో పాటు ఇదే డిమాండ్ తో దాఖలైన పిటిషన్లపై  విచారణ  నిర్వహించింది హైకోర్టు.

ఈ కేసు విచారణను గత నెల  30వ తేదీన విచారణను ప్రారంభించింది హైకోర్టు. ప్రభుత్వం తరపున దుశ్వంత్ ధవే వాదనలు విన్పించారు. గత నెల 30న వాదనలను విన్న హైకోర్టు డిసెంబర్ 5వ తేదీకి విచారణను వాయిదా వేసింది. దీంతో ఈ కేసుకు సంబంధించి  గత నెల విచారణకు కొనసాగింపుగా  విచారణ కొనసాగించింది. నిన్నటి వాదనలకు కొనసాగింపుగా  ఇవాళ కూడా వాదనలు సాగాయి.  సిట్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది దుష్యంత్ దే వాదనలు విన్పించారు.దర్యాప్తు ఇంకా తొలి దశలోనే ఉందని దుష్యంత్ దువే చెప్పారు. దర్యాప్తు మధ్యలోనే ఉన్నప్పుడు సీబీఐకి ఇవ్వాలని ఎలా అడుగుతారని దుష్యంత్ దవే ప్రశ్నించారు. దర్యాప్తు మధ్యలోనే ఉన్నప్పుడు సీబీఐకి ఇవ్వాలని అడుగుతున్నారని ధవే ప్రశ్నించారు.
బీజేపీ కూడా సిట్ జరుపుతున్న దర్యాప్తునకు సహకరించాలని దుష్యంత్ కోరారు.నిందితులపై ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని కూడా  ధుశ్యంత్ ధవే ఈ సందర్భంగా గుర్తు చేశారు.

alsore read:టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసు: మొయినాబాద్ పోలీసుల మెమోను కొట్టేసిన ఏసీబీ కోర్టు
మొయినాబాద్ ఫామ్ హౌస్ లో  నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారని రామచంద్రభారతి, సింహాయాజీ,నందకుమార్ లను  పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.  
అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలను ఈ ముగ్గురు ప్రలోభాలకు గురి చేశారని  పోలీసులకు ఫిర్యాదు అందింది. 
ఈ కేసు విచారణకు సిట్ ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఈ కేసు విచారణకు సీబీఐకి ఇవ్వాలని బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది. సిట్ విచారణ సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే సాగుతున్నందున సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణను ఆ పార్టీ కోరుతుంది.  బీజేపీ సహా  పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేస్తుంది.

click me!