ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుకు సంబంధించి హైకోర్టు తీర్పు కాపీ తర్వాత సీబీఐ అధికారులు రంగంలోకి దిగనున్నారు. సీబీఐ అధికారులు ఎప్ఐఆర్ ను నమోదు చేసే అవకాశం ఉంది.
హైదరాబాద్: ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుకు సంబంధించి హైకోర్టు తీర్పు తర్వాత సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును సీబీఐ విచారణకు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. గత ఏడాది డిసెంబర్ 26న ఇదే విషయమై తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ కూడా సీబీఐ విచారణకు ఆదేశించింది. సింగిల్ బెంచ్ విచారణను తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ లో కేసీఆర్ సర్కార్ ఈ ఏడాది జనవరి 4న సవాల్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసే అవకాశం లేకపోలేదు.
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు కాపీ అందిన వెంటనే సీబీఐ అధికారులు ఈ కేసు దర్యాప్తు విషయమై రంగంలోకి దిగే అవకాశం ఉంది. తొలుత ఎప్ఐఆర్ నమోదు చేస్తారు. ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు సేకరించిన సమాచారాన్ని కూడా సీబీఐ అధికారులు తీసుకోనున్నారు.
తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు కాపీ సీబీఐ అధికారలకు చేరింది. అయితే ఈ తీర్పు ఆధారంగా సమాచారం కావాలని సీబీఐ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే ఈ లోపుగానే డివిజన్ బెంచ్ లో తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసింది. దీంతో ఈ సమాచారం ఇచ్చేందుకు కొంత ఆలస్యమైంది. ఇవాళ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు కాపీ అందిన వెంటనే సీబీఐ అధికారులు రంగంలోకి దిగే అవకాశాలున్నాయి.
ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుకు సంబంధించి ఆడియో, వీడియో సంభాషణలను సిట్ ఇప్పటికే సేకరించింది. అయితే సీబీఐకి చెందిన హైద్రాబాద్ అధికారులు ఈ కేసును విచారిస్తారా లేక ఢిల్లీలోని జనరల్ అపెన్స్ వింగ్ అధికారులు విచారిస్తారా అనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
సిట్ విచారణ తెలంగాణ ప్రభుత్వానికి అనకూలంగా ఉందని బీజేపీ నేతలు విమర్శలు చస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు సిట్ విచారణ సాగిందని బీజేపీ నేతలు విమర్శలు చేశారు. దర్యాప్తు సంస్థలను బీజేపీ తమకు అనకూలంగా ఉపయోగించుకుంటుందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలను విపక్షపార్టీలపై ఉపయోగిస్తుందని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. అందుకే సీబీఐ విచారణను బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు.
ఈ కేసు విషయమై సీబీఐ విచారణకు తాము సహకరిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చెప్పారు. ప్రజాస్వామ్యబద్దంగా ఏదైనా సాగాలని తాము కోరుకుంటున్నామన్నారు. న్యాయబద్దంగా