ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇవాళ అసెంబ్లీ ఆవరణలో భేటీ అయ్యారు
హైదరాబాద్: ఎంఐఎం శాసనసభపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీపీతో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోమవారం నాడు భేటీ అయ్యారు. గంటకు పైగా ఈ సమావేశం సాగింది. ఈ భేటీలో ఏం చర్చించారనేది ప్రస్తుతం రాజకీయంగా చర్చకు దారి తీసింది.
ఇవాళ అసెంబ్లీలో తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడింది. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీని సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క పిలిచారు. సీఎల్పీ కార్యాలయంలోనే అక్బరుద్దీన్ తో పాటు మాజీ మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి లు కూడా సమావేశమయ్యారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో ఎంఐఎం సుధీరంగా మిత్రపక్షంగా ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో ఎంఐఎంకు కాంగ్రెస్ పార్టీకి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఎంఐఎం బీఆర్ఎస్ తో మిత్రపక్షంగా కొనసాగుతుంది.
undefined
తెలంగాణలో బీఆర్ఎస్ తో ఎంఐఎం మిత్రపక్షంగా ఉంది. రెండు రోజుల క్రితం అసెంబ్లీలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం సాగింది .గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగం సమయంలో మంత్రి అక్బరుద్దీన్ ప్రసంగంపై మంత్రి కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. బడ్జెట్ పై చర్చ సమయంలో ప్రసంగిస్తున్నట్టుగా అక్బరుద్దీన్ తీరు ఉందన్నారు. ఏడురుగురు ఎమ్మెల్యేలున్న ఎంఐఎంకు ఇంత సమయం ఇస్తే వందకు పైగా ఎమ్మెల్యేలున్న తమ పార్టీ కి ఎంత సమయం కేటాయించాలని మంత్రి కేటీఆర్ స్పీకర్ ను కోరారు. దీనికి ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు.
వచ్చే ఎన్నికల్లో 50 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు. అంతేకాదు తమ పార్టీ 15 మంది ఎమ్మెల్యేలను గెలుస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు వచ్చే ఎన్నికల్ో ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే విషయమై తమ పార్టీ అధినేతతతో మాట్లాడుతానని కూడా అక్బరుద్దీన్ ఓవైసీపీ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.