నకిలీ ఐపీఎస్ అధికారి శ్రీనివాస్ కేసు:హైద్రాబాద్‌లో నలుగురు వ్యాపారులకు సీబీఐ నోటీసులు

By narsimha lode  |  First Published Dec 1, 2022, 2:32 PM IST

హైద్రాబాద్‌కి  చెందిన  నలుగురు వ్యాపారులు నకిలీ ఐపీఎస్  అధికారితో  సంబంధాలున్నట్టుగా  సీబీఐ గుర్తించింది.వీరిని  విచారణకు రావాలని  సీబీఐ నోటీసులు జారీ  చేసింది.


హైదరాబాద్: నకిలీ ఐపీఎస్  అధికారి  శ్రీనివాస్ కేసులో  మరో  నలుగురికి  సీబీఐ అధికారులు  గురువారంనాడు నోటీసులు జారీ  చేశారు.  రేపు విచారణకు  రావాలని ఆదేశించారు.ఇదే  కేసులో  ఇప్పటికే తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ , టీఆర్ఎస్  ఎంపీ  గాయత్రి రవిలకు కూడా సీబీఐ నోటీసులు జారీ చేసింది.  ఈ నోటీసులు జారీ చేయడంతో  వీరిద్దరూ ఇవాళ సీబీఐ విచారణకు  హాజరయ్యారు.

హైద్రాబాద్‌కు చెందిన  నలుగురు వ్యాపారులకు  సీబీఐ అధికారులు ఇవాళ నోటీసులు జారీ  చేశారు. నకిలీ ఐపీఎస్  అధికారి శ్రీనివాస్ కి వ్యాపారులు భారీగా నగదు, బంగారు ఆభరణాలు ఇచ్చినట్టుగా  సీబీఐ అధికారులు గుర్తించారు. నకిలీ ఐపీఎస్  అధికారితో  నలుగురు వ్యాపారులకు  ఎలా పరిచయం ఏర్పడిందనే విషయమై  సీబీఐ అధికారులు విచారణ చేయనున్నారు. నకిలీ  ఐపీఎస్  అధికారికి  ఎందుకు  బంగారం, నగదును ఇచ్చారనే విషయమై కూడా  సీబీఐ  అధికారులు దర్యాప్తు  చేయనున్నారు.

Latest Videos

undefined

also read:సీబీఐ విచారణకు హాజరైన మంత్రి గంగుల, ఎంపీ గాయత్రి రవి.. వాంగ్మూలం రికార్డు చేయనున్న అధికారులు..!

నకిలీ ఐపీఎస్  అధికారి  కొవ్విరెడ్డి  శ్రీనివాసరావును  సీబీఐ అధికారులు  ఈ నెల 28న అరెస్ట్  చేశారు.శ్రీనివాసరావు  తమిళనాడు రాష్ట్రంలో  నివాసం ఉంటున్నాడు. పలు రాష్ట్రాల్లో  రాజకీయ నేతలతో  శ్రీనివాసరావుకి సంబంధాలు  పెట్టుకున్నాడని  సీబీఐ అధికారులు  గుర్తించారు. పలు కేసుల్లో  ఉన్నవారిని  గుర్తించి  ఈ  కేసుల నుండి  వారిన  బయట పడేస్తానని  నమ్మించి బాధితుల నుండి డబ్బులు వసూలు చేసినట్టుగా సీబీఐ గుర్తించింది. 

click me!