ఆస్తుల కేసులో జగన్ పిటిషన్‌పై 20న విచారణ

Published : Sep 06, 2019, 03:56 PM IST
ఆస్తుల కేసులో జగన్ పిటిషన్‌పై 20న విచారణ

సారాంశం

ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహయింపును కోరుతూ జగన్ దాఖాలు చేసిన పిటిషన్ పై ఈ నెల 20 న విచారణ జరగనుంది.

హైదరాబాద్: ఆస్తుల కేసులో తనకు మినహాయింపు ఇవ్వాలని  కోరుతూ ఏపీ సీఎం జగన్ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా పడింది.

ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి మాత్రమే హాజరయ్యారు. ఈ కేసులో 11 చార్జీషీట్లపై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.

సీఎంగా అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున తన వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని సీబీఐ కోర్టును జగన్ తరపు న్యాయవాది ఆశోక్ రెడ్డి కోరారు.సీఎం హోదాలో కోర్టుకు హాజరు కావాలంటే ప్రోటోకాల్‌తో పాటు బందోబస్తుకు భారీ వ్యయం అవుతోందని జగన్ పిటిషన్ లో కోరారు.ఈ పిటిషన్ పై ఈ నెల 20న విచారణ చేయనున్నట్టు కోర్టు తెలిపింది.

సంబంధిత వార్తలు

సీబీఐ కోర్టులో సీఎం జగన్ పిటీషన్

ఆస్తుల కేసులో సీఎం జగన్ కు ఊరట: ఆస్తులు తిరిగి ఇచ్చేయాలని ఈడీకి ట్రిబ్యునల్ ఆదేశం

PREV
click me!

Recommended Stories

Railway Offer : సంక్రాంతికి ఊరెళ్లేందుకు టికెట్స్ కావాలా..? ఈ యాప్ ద్వారా కొంటే సూపర్ డిస్కౌంట్
School Holidays : జనవరి 1న విద్యాసంస్థలకు సెలవు ఉందా..? మీకు ఈ మెసేజ్ వచ్చిందా..?