వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడాలో నగదు మాయం .. క్యాషియర్‌పై సస్పెన్షన్ వేటు

By Siva KodatiFirst Published May 12, 2022, 9:59 PM IST
Highlights

హైదరాబాద్ వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.22 లక్షల నగదు మాయమైన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై బ్యాంక్ యాజమాన్యం స్పందించింది. దర్యాప్తు ముగిసే వరకు క్యాషియర్ ప్రవీణ్‌పై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిపింది. 

హైదరాబాద్ వనస్థలిపురం (vanasthalipuram)  బ్యాంక్ ఆఫ్ బరోడాలో నగదు మిస్సింగ్ ఘటనకు సంబంధించి బ్యాంక్ స్పందించింది. దీనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని .. దర్యాప్తు జరుగుతోందని తెలిపింది. విచారణ ముగిసి వాస్తవాలు బయటకు వచ్చే వరకు క్యాషియర్ ప్రవీణ్‌ను సస్పెన్షన్‌లో వుంచుతామని బ్యాంక్ ప్రకటించింది. దర్యాప్తులో పోలీసులకు సహకరిస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. 

అంతకుముందు 24 గంటలు గడవకముందే క్యాషియర్ మాట మార్చేశాడు. బుధవారం డబ్బులను తానే తీసుకెళ్లానని చెప్పిన క్యాషియర్ ప్రవీణ్.. ఇవాళ మాట మార్చేశాడు. బ్యాంక్ నుంచి డబ్బులు తాను తీసుకెళ్లలేదంటూ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. బ్యాంక్ లావాదేవీల్లో తక్కువగా వచ్చిన నగదును తనపై మోపుతున్నారని ఆరోపించాడు. గతంలోనూ పలుమార్లు షార్టెజ్ వచ్చిందని.. మేనేజర్‌ను నిలదీసినా పట్టించుకోలేదని ప్రవీణ్ చెబుతున్నాడు. అయితే బ్యాంక్ మేనేజర్ వినయ్ నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరుగుతోందని ఆరోపించాడు. అనవసరంగా తనను నిందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా బ్యాంక్‌లో సరైన నిఘా కూడా లేదని క్యాషియర్ ప్రవీణ్ ఆరోపించాడు. 

కాగా..Bank Of Baroda వనస్థలిపురం బ్రాంచీలో ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి క్యాషియర్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 10వ తేదీన యధావిధిగా విదులకు హాజరయ్యాడు. సాయంత్రం నాలుగు గంటలకు తనకు కడుపులో నొప్పిగా ఉందని  బ్యాంకు మేనేజర్ కు చెప్పాడు. మెడికల్ షాపులో టాబ్లెట్ తీసుకుని వస్తానని చెప్పి ప్రవీణ్ కుమార్ బ్యాంకు నుండి వెళ్లిపోయాడు. బ్యాంకు ముగిసే సమయమైనా కూడా ప్రవీణ్ కుమార్ బ్యాంకుకు రాలేదు. దీంతో అతనికి బ్యాంకు సిబ్బంది ఫోన్ చేశారు. అయితే ఆయన ఫోన్ స్విచ్ఛాప్ వచ్చింది. అనుమానం వచ్చి ప్రవీణ్ కుమార్ క్యాబిన్ చెక్ చేస్తే రూ. 22 లక్షలు మాయమైనట్టుగా బ్యాంకు సిబ్బంది గుర్తించారు. 

దీనిపై వెంటనే బ్యాంకు మేనేజర్ Policeలకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రవీణ్ కుమార్ కోసం గాలిస్తున్నారు. అయితే ఇదే సమయంలో ప్రవీణ్ కుమార్ బ్యాంకు మేనేజర్ కు మేసేజ్ పెట్టాడు. క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు వస్తే తాను తిరిగి బ్యాంకు కు వస్తానని లేకపోతే ఆత్మహత్య చేసుకొంటానని ఆ మేసేజ్ లో తెలిపాడు. ఈ మేసేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్ కుమార్ ఉపయోగించిన సెల్ పోన్ ఆధారంగా అతను ఎక్కడ ఉన్నాడనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. నాలుగు పోలీసు బృందాలు ప్రవీణ్ కుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో అతను మాట మార్చడం అనుమానాలకు తావిస్తోంది. 
 

click me!