నిర్మల్‌ : నడిరోడ్డుపై కత్తెరతో గొంతు కోసి యువకుడి హత్య

Siva Kodati |  
Published : May 12, 2022, 08:19 PM IST
నిర్మల్‌ : నడిరోడ్డుపై కత్తెరతో గొంతు కోసి యువకుడి హత్య

సారాంశం

నిర్మల్‌ పట్టణంలోని ఫైల్ బజార్ ఏరియాలో జుబేర్ ఖాన్ అనే యువకుడిని పట్టపగలు దారుణంగా హత్య చేశాడో యువకుడు. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. 

నిర్మల్‌లో పట్టపగలు యువకుడి దారుణ హత్య (murder) కలకలం రేపింది. ఫైల్ బజార్ ఏరియాలో జుబేర్ ఖాన్ అనే యువకుడిని గొంతు కోసి హత్య చేశాడు మరో యువకుడు. కత్తెరతో గొంతు కోసి కిరాతకంగా చంపేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. హత్య జరిగిన తర్వాత నిందితుడు పోలీసులు ఎదుట లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. కేసు  నమోదు చేసుకున్న పోలీసులు జుబేర్ ఖాన్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

ఇకపోతే.. గత మంగళవారం కూడా నిర్మల్ జిల్లాలో (nirmal district) కత్తిపోట్ల (stabbing) ఘటన కలకలం రేపింది. ఓ యువకుడిని కత్తితో పొడిచి పరారయ్యారు కొంతమంది వ్యక్తులు. డాక్టర్స్ లేన్‌లోని ఓ ల్యాబ్‌లో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. దాడి చేసింది ఎవరో.. ఎందుకు చేశారు.. తదితర కారణాలను పోలీసులు అన్వేషించే పనిలో వున్నారు. 

PREV
click me!

Recommended Stories

Konda Surekha: నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక అదిష్టానం ఇష్టం.. కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు
Rain Alert: తెలంగాణలో వింత పరిస్థితి.. ఉదయం ఎండ రాత్రి వర్షం. ఈ జిల్లాలకు రెయిన్ అలర్ట్