ఓటుకు నోటు కేసు: కాంగ్రెసు ఎంపీ రేవంత్ రెడ్డికి హైకోర్టు షాక్

Published : Jun 02, 2021, 07:31 AM IST
ఓటుకు నోటు కేసు: కాంగ్రెసు ఎంపీ రేవంత్ రెడ్డికి హైకోర్టు షాక్

సారాంశం

ఓటుకు నోటు కేసులో కాంగ్రెసు ఎంపీ రేవంత్ రెడ్డికి చుక్కెదురైంది. ఏసీబీ ప్రత్యేక కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి వేసిన రివ్యూ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది.

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. కేసును విచారించే పరిధి ఎసీబీ కోర్టుకు లేదంటూ ఆయన దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె. లక్ష్మణ్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. 

2015 ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆ సమయంలో టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేయాలని లేదా ఓటింగ్ ను బహిష్కరించాలని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను ప్రలోభపెట్టారనే అభియోగాలతో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. 

అయితే, ఇది ఎన్నికలకు సంబంధించిన కేసులను విచారించే కోర్టు పరిధిలోకి వస్తుందని రేవంత్ రెడ్డి జనవరి 21వ తేదీన ఏసీబీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను ప్రత్యేక కోర్టు జనవరి 21వ తేదీన కొట్టేసింది. 

దాంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో లంచం ఇచ్చే కేసులు ఐపీసీసోలని సెక్షన్ 171 -బి కిందికి వస్తాయని రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. అందువల్ల కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని ఆయన కోరారు. 

అయితే, ఈ కేసుోల ఏ2, ఏ3, ఏ4గా ఉన్నవారు వేసిన డిశ్చార్జీ పిటిషన్లను ట్రయల్ కోర్టు కొట్టివేసిందని ఏసీబీ తరఫు న్యాయవాది రవికిరణ్ రావు వాదించారు. ఈ ఉత్తర్వులను హైకోర్టు సమర్థించిందని గుర్తు చేశారు. ఇవే అంశాలను ఈ కేసులోనూ ప్రస్తావించారని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu