తెలంగాణలో కరోనా వ్యాప్తిలో తగ్గుదల కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 94,189 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 2,493 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,80,834కి చేరింది.
తెలంగాణలో కరోనా వ్యాప్తిలో తగ్గుదల కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 94,189 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 2,493 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,80,834కి చేరింది. ఇవాళ మరో 15 మంది కోవిడ్‌కు బలవ్వగా.. ఇప్పటి వరకు మొత్తం మృతుల సంఖ్య 3,296కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 3,308 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 33,254 యాక్టీవ్ కేసులు ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం బులిటెన్‌లో తెలిపింది. ఎప్పటిలాగే జీహెచ్‌ఎంసీ పరిధిలో 318 కేసులు నమోదయ్యాయి.
Also Read:కేటీఆర్ ఆదేశాలు.. రంగంలోకి వైద్య ఆరోగ్య శాఖ, 6 ఆసుపత్రులకు అనుమతులు రద్దు
ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 12, భద్రాద్రి కొత్తగూడెం 115, జగిత్యాల 48, జనగామ 34, జయశంకర్ భూపాలపల్లి 63, గద్వాల 41, కామారెడ్డి 15, కరీంనగర్ 129, ఖమ్మం 121, మహబూబ్‌నగర్ 88, ఆసిఫాబాద్ 14, మహబూబాబాద్ 105, మంచిర్యాల 88, మెదక్ 29, మేడ్చల్ మల్కాజిగిరి 137, ములుగు 54, నాగర్ కర్నూల్ 52, నల్గగొండ 165, నారాయణపేట 21, నిర్మల్ 14, నిజామాబాద్ 18, పెద్దపల్లి 96, సిరిసిల్ల 53, రంగారెడ్డి 152, సిద్దిపేట 68, సంగారెడ్డి 66, సూర్యాపేట 73, వికారాబాద్ 61, వనపర్తి 61, వరంగల్ రూరల్ 58, వరంగల్ అర్బన్ 91, యాదాద్రి భువనగిరిలో 33 చొప్పున కేసులు నమోదయ్యాయి.