కోవిడ్‌తో మరణం, అంత్యక్రియలకు నోచుకోని అభాగ్యులకు.. నేనున్నానంటూ భరోసా

By Siva KodatiFirst Published Jun 1, 2021, 9:07 PM IST
Highlights

కరోనా వైరస్ దేశంలో సామాజిక పరిస్థితులను మరింత దిగజారుస్తోంది. వైరస్ సోకిందంటే చాలు తెలిసినవారు, బంధుమిత్రులు వారి ఇంటి ఛాయలకు కూడా వెళ్లడం లేదు. సాయం కావాలని స్వయంగా అర్ధించినా ఆపదలో ఆదుకునేవారు లేరు. ఇక కోవిడ్‌ వచ్చి మరణించిన వారి పరిస్ధితి మరింత దారుణం

కరోనా వైరస్ దేశంలో సామాజిక పరిస్థితులను మరింత దిగజారుస్తోంది. వైరస్ సోకిందంటే చాలు తెలిసినవారు, బంధుమిత్రులు వారి ఇంటి ఛాయలకు కూడా వెళ్లడం లేదు. సాయం కావాలని స్వయంగా అర్ధించినా ఆపదలో ఆదుకునేవారు లేరు. ఇక కోవిడ్‌ వచ్చి మరణించిన వారి పరిస్ధితి మరింత దారుణం. అంత్యక్రియలు చేసేందుకు స్వయంగా కుటుంబసభ్యులు, తోడబుట్టినవారు, పిల్లలే ముందుకు రావడం లేదు. దీంతో అధికారులు, స్వచ్ఛంద సంస్థలే దగ్గరుండి అంతిమ సంస్కారాలు చేస్తున్నాయి. తాజాగా కరోనాతో మృతి చెందిన వారికి అంతిమ సంస్కారాలు చేసేందుకు మేమున్నామంటూ ఓ మహిళా నాయకురాలు తన ఔదర్యాన్ని చాటుకుంటున్నారు. 

Also Read:కరోనా పాజిటివ్.. తగ్గదేమోనన్న భయం: చెట్టుకొకరు, కల్వర్టుకు మరొకరు ఉరేసుకుని ఆత్మహత్య

వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి  జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు. కరోనా కాటుకు గురై అంతిమ సంస్కరాలకు నోచుకొని అనాథ శవాలకు అంత్యక్రియలు చేసి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. మానవసేవే మాధవ సేవ  అని నమ్మిన సంధ్యారాణి ఎక్కడ తన అవసరం ఉంటే అక్కడ వాలిపోయి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. తాజాగా మద్దిర్యాలకు చెందిన ప్రతాప్ రెడ్డి  కరోనాతో మృతి చెందారు. ఇదే సమయంలో కుటుంబ సభ్యులు సైతం కరోనా బారిన పడి ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. దీంతో ప్రతాప్ రెడ్డి దహన సంస్కారాలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో విషయం సంధ్యారాణికి తెలిసింది. దీంతో ఆమె అతని అంత్యక్రియలు జరిపించారు. రాజకీయాలకు అతీతంగా ఆమె చేస్తున్న సామాజిక కార్యక్రమాలను ప్రశంసిస్తున్నారు. 

 

"

click me!