హత్యాయత్నం, దొంగతనం.. బీజేపీ నేత రాజాసింగ్‌పై ఉన్న కేసులివే

By sivanagaprasad kodatiFirst Published Nov 20, 2018, 12:50 PM IST
Highlights

వివాదాస్పద వ్యాఖ్యలు, దురుసు ప్రవర్తనతో నిత్యం వార్తల్లో ఉంటారు బీజేపీ నేత, గోషా మహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. సిట్టింగ్ స్థానం నుంచి మరోసారి బరిలో నిలిచిన ఆయనపై 2014లో నమోదైన కేసులతో పోలిస్తే.. అవి ఇప్పుడు రెట్టింపు అయ్యాయి

వివాదాస్పద వ్యాఖ్యలు, దురుసు ప్రవర్తనతో నిత్యం వార్తల్లో ఉంటారు బీజేపీ నేత, గోషా మహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. సిట్టింగ్ స్థానం నుంచి మరోసారి బరిలో నిలిచిన ఆయనపై 2014లో నమోదైన కేసులతో పోలిస్తే.. అవి ఇప్పుడు రెట్టింపు అయ్యాయి.

ఎన్నికల సంఘానికి తాజాగా సమర్పించిన అఫిడవిట్‌లో ఇప్పటి వరకు 43 కేసులు నమోదైనట్లు తెలిపారు. ధూల్‌‌పేటలోని దిలావర్ గంజ్ ప్రాంతానికి చెందిన రాజాసింగ్... 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్‌ను 46,793 ఓట్ల తేడాతో ఓడించారు.

మరో వర్గం మనోభావాలను దెబ్బతీశాడని.. శాంతియుత వాతావరణ పరిస్థితులకు భంగం కలిగించారని, ఇంటి ఆక్రమణ, హత్యాయత్నం, దొంగతనం, ఫోర్జరీ, దాడుల కేసుల్లో రాజాసింగ్ నిందితుడు. ఆయనపై హైదరాబాద్‌లోని అఫ్జల్ గంజ్, బేగంబజార్, అబిడ్స్, మంగల్ హాట్, షాయినాయత్ గంజ్, సైఫాబాద్, సుల్తాన్ బజార్ పోలీసులు కేసులు నమోదు చేశారు.

తాజాగా నామినేషన్ వేసే సందర్భంగా ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై పోలీసులు మరో మూడు కేసులను నమోదు చేశారు.  తాను ఎన్నికల్లో సాధించాక ఆ కేసులపై హైకోర్టుకు వెళతానని రాజాసింగ్ స్పష్టం చేశారు. 

యోగిని అనుసరిస్తాం... హైదరాబాద్‌తో పాటు వాటి పేర్లూ మారుస్తాం: రాజాసింగ్

ఎమ్మెల్యే రాజాసింగ్ పై చర్య తీసుకోండి

click me!