బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై కేసు నమోదు...

Published : Jan 03, 2022, 12:15 PM IST
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై కేసు నమోదు...

సారాంశం

 నవంబర్ 8న ప్రెస్ మీట్ లో సీఎం మీద అర్వింద్ అనుచిత వ్యాఖ్యలు చేశారని బంజారాహిల్స్ పీఎస్ లో బోయిన్ పల్లికి చెందిన వ్యాపారి కల్యాణ్ సందీప్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అర్వింద్ పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

హైదరాబాద్ : నిజామాబాద్ బీజేపీ ఎంపీ Dharmapuri Arvindమీద కేసు నమోదయ్యింది. నగరంలోని Banjarahills PS లో అర్వింద్ మీద కేసు నమోదు చేశారు. సీఎం KCR మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో ఐపీసీ 504, 55(2), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నవంబర్ 8న ప్రెస్ మీట్ లో సీఎం మీద అర్వింద్ అనుచిత వ్యాఖ్యలు చేశారని బంజారాహిల్స్ పీఎస్ లో బోయిన్ పల్లికి చెందిన వ్యాపారి కల్యాణ్ సందీప్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అర్వింద్ పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

ఇదిలా ఉండగా, తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోకు నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (.. కరీంనగర్‌లోని తన ఎంపీ క్యాంప్‌ కార్యాలయంలో చేపట్టిన జాగరణ దీక్షను పోలీసులు ఆదివారం రాత్రి భగ్నం చేశారు. అనంతరం ఆయనను మానకొండూరు పోలీసు స్టేషన్‌కు తరిలించారు. అయితే ఈ ఉదయం కరీంనగర్‌లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు(పీటీసీ) బండి సంజయ్‌ను తీసుకొచ్చారు. 

Bandi Sanjayపై రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు.. కరీంనగర్‌లో టెన్షన్

అయితే ఈ క్రమంలోనే కరీంనగర్ పోలీసులు.. బండి సంజయ్‌పై రెండు కేసులు నమోదు చేశారు. కోవిడ్ నిబంధనల ఉల్లంఘన, పోలీసుల విధులకు ఆటంకం కలగించడంపై  బండి సంజయ్ మీద కేసులు నమోదు చేశారు. ఆయనతో పాటు మరికొందరు బీజేపీ నేతలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

మరోవైపు ఈరోజు బండి సంజయ్‌ను కోర్టు ముందు హాజరు పరిచేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈలోపు బండి సంజయ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం పీటీసీ గ్రౌండ్ వద్దకు అంబులెన్స్‌ చేరుకుంది. వైద్య పరీక్షలు పూర్తయ్యాక మధ్యాహ్నం తర్వాత బండి సంజయ్‌ను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అయితే నిన్న రాత్రి నుంచి ఎలాంటి ఆహారం తీసుకోలేదని తెలుస్తోంది. 

బండి సంజయ్ ను కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించిన పోలీసులు

ఇక, ఈరోజు ఉదయం బండి సంజయ్‌ను పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తీసుకొచ్చారనే సమాచారంతో.. పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు అక్కడికి చేరుకుంటున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు బండి సంజయ్‌ అరెస్ట్‌కు నిరసనగా బీజేపీ తెలంగాణ నాయకులు.. నేడు జిల్లా, మండల కేంద్రాల్లో బీజేపీ దీక్షలు చేపట్టనున్నారు. కోవిడ్ నిబంధనల మేరకు ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేయాలని తెలంగాణ బీజేపీ నిర్ణయం తీసుకుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.