అర్థరాత్రి క్యాబ్ డ్రైవర్ పై దాడి : 12 మందిపై కేసు..

Published : Aug 09, 2022, 11:50 AM IST
అర్థరాత్రి క్యాబ్ డ్రైవర్ పై దాడి : 12 మందిపై కేసు..

సారాంశం

క్యాబ్ డ్రైవర్ పై విచక్షణారహితంగా దాడిచేసి.. అతడిని కోమాలోకి వెళ్లేలా చేసిన 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

హైదరాబాద్ :  రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లి ప్రాంతంలో క్యాబ్ డ్రైవర్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వివేక్ రెడ్డి కస్టడీ సోమవారంతో ముగిసింది. దీంతో పోలీసులు ప్రధాన నిందితుడిని జైలుకు తరలించారు. క్యాబ్ డ్రైవర్ వెంకటేష్ తో పాటు యజమాని పర్వతాలు, తనతో పాటు 12 మంది కలిసి దాడి చేసినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు.  గత నెల 31న ఉప్పర్ పల్లికి చెందిన వివేక్ రెడ్డి (24) బి.యన్ రెడ్డి నగర్ నుంచి క్యాబ్ బుక్ చేసుకుని ఉప్పర్ పల్లికి వెళుతున్నాడు. బుకింగ్ తీసుకున్న వెంకటేష్ (27) వివేక్ రెడ్డిని పికప్ చేసుకుని చాంద్రాయణగుట్ట మీదుగా ఉప్పర్ పల్లికి వెళుతున్నాడు.  ఈ క్రమంలో రాత్రి 12 గంటల సమయంలో కారు యజమాని వెంకటేష్ కు ఫోన్ చేశాడు. దీంతో ఉప్పర్ పల్లి వద్ద డ్రాప్ చేసి వస్తానని చెప్పాడు. అతడిని మార్గమధ్యలో ఎక్కించుకున్నాడు. దీంతో కారులోనే ముగ్గురూ కలిసి వెళ్లారు. 

డబ్బులు ఇచ్చే దగ్గర గొడవ…
ఉప్పర్ పల్లి వద్ద కారు దిగిన తరువాత డబ్బులు చెల్లించడం విషయంలో వివాదం చోటు చేసుకుంది. దీంతో క్యాబ్ డ్రైవర్, పాసింజర్ మధ్య ఘర్షణ జరిగింది. ఈ విషయాన్ని వివేక్ రెడ్డి తన స్నేహితులకు తెలపడంతో వారు సైతం ఘటనా స్థలానికి వచ్చి డ్రైవర్తో పాటు యజమానిని కూడా కొట్టి, వారి కారులోనే ఇద్దరిని బంధించారు. ఇదే సమయంలో రాజేంద్రనగర్ గస్తీ పోలీసులు పెట్రోల్ ఎందుకురా ఘర్షణ విషయాన్ని గమనించారు. వారందరిని స్టేషన్కు తరలించారు.వివేక్ రెడ్డి మొదట కారు డ్రైవర్ వెంకటేశ్, పర్వతాలు తన గొలుసు తీసుకుని దాడి చేశారని ఫిర్యాదు చేశాడు. ఇక పర్వతాలేమో డ్రైవర్ డబ్బులు చెల్లించి ఉంటే తమపై దాడి చేశారని తెలపడంతో వారిని స్టేషన్లో కూర్చోబెట్టారు. అప్పటికే ఉదయం కావడంతో వెంకటేష్ రక్తపువాంతులు చేసుకోవడంతో వారిని ఆస్పత్రికి తరలించారు.

హైదరాబాద్‌లో అర్ధరాత్రి క్యాబ్ డ్రైవర్‌పై దాడి.. అరగంట ఆలస్యంగా వచ్చాడని..

దెబ్బలు తట్టుకోలేక…
ఘర్షణలో ఇద్దరికి గాయాలు కావడంతో ఆ దెబ్బలు తాళలేక ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిద్దరి ఉస్మానియా ఆస్పత్రికి తరలించామని, డ్రైవర్ వెంకటేష్ పరిస్థితి విషమంగా ఉందని.. దీంతో కుటుంబ సభ్యులు ఉస్మానియా నుంచి ప్రైవేట్ ఆస్పత్రికి అతడిని తరలించారని తెలిపారు. కాగా అదే రోజు సాయంత్రం డ్రైవర్ వెంకటేష్ కోమాలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం అతను చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కాగా, రాజేంద్రనగర్ పోలీసులు వివేక్ రెడ్డి, అతని స్నేహితులపై మొదట దాడి కేసు నమోదు చేశారు. తర్వాత  బాధితుడు వెంకటేష్ కోమాలోకి వెళ్ళడంతో హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

ఎస్సై అవుతాడు అనుకుంటే…
బాధితుడు వెంకటేష్ ఎస్సై పరీక్షలకు సిద్ధమవుతున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తూనే దీనికి సంబంధించిన శిక్షణ తీసుకుంటున్నాడని..  ఆదివారం ఎస్ఐ పరీక్షలు రాయాల్సి ఉండగా, ఆసుపత్రిలో కోమాలోనే ఉన్నాడని విలపించారు. దాడి జరగకపోతే పరీక్షలు రాసి ఎస్ఐ గా సెలెక్ట్ అయ్యేవాడిని..  దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Jabardasth Anchor Rashmi Gowtham Pressmeet: మీ సంస్కృతి అంతా మా బట్టలపైనే ఉంది| Asianet News Telugu
Harish Rao Comments on Revanth Reddy:టెండర్లురద్దు చేసి సిబిఐవిచారణ జరిపించాలి | Asianet News Telugu