తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం నాడు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని ఐదు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్: Telangana రాష్ట్రంలో మంగళవారం నాడు భారీ నుండి అతి Heavy Rains కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. దీంతో భారీ వర్షాలు కురిసే జిల్లాల అధికారులను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఉత్తర తెలంగాణలోని మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ను జారీ చేసింది IMD. బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది. మరికొన్ని గంటల్లో అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ ప్రకటించింది.
నైరుతి రుతు పవనాలు ప్రవేశంతోనే Telangana రాష్ట్రంలో వర్షాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక చోట వర్షం కురుస్తున్న పరిస్థితి నెలకొంది. నైరుతి రుతు పవనాలు ప్రవేశించిన రోజు నుండి రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని గంటల పాటు మాత్రమే వర్షం తెరిపిని ఇస్తుంది. ఇటీవలనే Godavari నదికి భారీగా వరద పోటెత్తింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా గత 100 ఏళ్లలో రాని వరద గోదావరి నదికి వచ్చింది.దీంతో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలించారు.
undefined
Krishna పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో కూడా కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులకు కూడా భారీగా వరద వచ్చి చేరింది. ఈ నెల మొదటి వారం నుండి కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందుుల పడుతున్నారు. అల్పపీడనం కారణంగా హైద్రాబాద్ లో వర్షం కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మరో వైపు రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో గత మాసంలో కురిసిన వర్షాలతో తెలంగాణ రాష్ట్రంలో సుమారు రూ. 1400 కోట్ల నష్టం వాటిల్లింది. అంతేకాదు 14 మంది మృత్యువాత పడ్డారు. ఈ విషయమై తమకు సహాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. రాష్ట్రంలో కేంద్ర బృందం కూడా పర్యటించి వరద నష్టంపై అంచనా వేసింది. మరో వైపు గత మాసంలో ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ వరద నష్టంపై కేంద్ర మంత్రులు, వీలైతే ప్రధాని మోడీని కలుస్తారని ప్రచారం సాగింది.
also read:హైదరాబాద్: రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ.. మంగళవారం వరకు భారీ వర్షాలు
అయితే న్యూఢిల్లీలో ఐదు రోజుల పాటు గడిపిన సీఎం కేసీఆర్ కేంద్రమంత్రుల, ప్రధానిని కలవకుండానే వెనుదిరిగారు. ఈ విషయమై బీజేపీ నేతలు కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి వరద నష్టంపై సహాయం చేసే విషయమై కేసీఆర్ కేంద్రంపై పోరాటానికి కార్యాచరణను సిద్దం చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో ఈ విషయమై తమ పార్టీ తరపున వాయిదా తీర్మానం ఇవ్వడంతో పాటు నిరసనకు కూడా దిగామని రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.