సర్టిఫికెట్ కావాలంటే నాతో ఏకాంతంగా గడపాలి.. మహిళతో డాక్టర్ నీచత్వం..

By Bukka SumabalaFirst Published Aug 9, 2022, 9:43 AM IST
Highlights

తన తండ్రికి సదరం సర్టిఫికెట్ కోసం వచ్చిన మహిళ మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో డాక్టర్. అంతేకాదు తనతో ఏకాంతంగా గడిపాలని, పర్మినెంట్ గా ఉంచుకుంటానని.. బేరం పెట్టాడు. 

ఖమ్మం : మహిళల మీద వేధింపులు మామూలుగా మారిపోయాయి. సమయం, సందర్భం.. వయసు తేడా, వావివరసలు ఉండడం లేదు. ఏ చిన్న సహాయం కోసం వెళ్లినా.. ఆశగా చూసే చూపులే.. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులకోసం వచ్చే మహిళలకు రకరకాలుగా వేధింపులు ఎదురవుతున్నాయి. తాజాగా సదరం సర్టిఫికెట్ కావాలంటే తనతో ఏకాంతంగా గడపాలంటూ బేరం పెట్టాడు ఓ నీచ డాక్టర్. ఈ ఘటన తెలంగాణరాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.

దివ్యాంగుడు అయిన తన తండ్రికి సదరం సర్టిఫికెట్ కోసం ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళ పట్ల కీచక వైద్యుడు అసభ్యంగా ప్రవర్తించాడు. సదరం సర్టిఫికెట్ కావాలంటే తనతో ఏకాంతంగా గడపాలని, తనతో పర్మినెంట్ గా ఉంటే నెలకు 20000 ఇస్తానని ఒత్తిడి చేశాడు. ఆ డాక్టర్ వేధింపులు భరించలేక సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తెలంగాణలోని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ సంఘటన వెలుగుచూసింది. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మహిళ  ఖమ్మం జిల్లాకు చెందిన తన తండ్రికి సదరం సర్టిఫికెట్ కోసం గత నెల 7న ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది.

అప్పు అడిగిన జూనియర్ ఆర్టిస్ట్ ను గదిలో బంధించి అత్యాచారం.. స్నేహితుడితో కూడా గడపాలంటూ...

ఓపి రాయించుకున్నాక రూం నెంబర్ 8లో ఉన్న డాక్టర్ని కలవాలి అని చెప్పడంతో లోపలికి వెళ్ళింది. సర్టిఫికెట్ పేరుతో ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్న డాక్టర్ ఆ తర్వాత నుంచి ఆమెకు పలుసార్లు ఫోన్ చేయడం మొదలు పెట్టాడు. సదరం సర్టిఫికెట్ కావాలంటే తనకు శారీరకంగా సహకరించాలని, పర్మినెంట్ గా తనతోనే ఉంటే నెలకు రూ. 20,000 చెల్లిస్తానని ఒత్తిడి చేశాడు. రాత్రి 12 గంటల సమయంలో వీడియో కాల్ చేసి ప్రైవేట్ పార్ట్స్ చూపించాలని వేధించసాగాడు.  

ఈ క్రమంలో ఆమెను ఒంటరిగా ఖమ్మం రావాలని బెదిరించడంతో గత నెల 17న ఆమె తన బంధువును తీసుకుని వెళ్ళింది. అది చూసిన ఆ వైద్యుడు అక్కడి నుంచి జారుకున్నాడు. ఆ తర్వాత కూడా వేధింపులు కొనసాగడంతో ఆమె ఆసుపత్రి సూపర్డెంట్ కు ఫిర్యాదు చేసింది. కానీ ఈ విషయాన్ని బయటకి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఆ వైద్యుడు వేధింపులు ఆగకపోవడంతో బాధిత మహిళ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

click me!