
Telangana Assembly Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఒకే విడతలో నేడు పోలింగ్ జరుగుతున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం సర్వం సిద్దం చేసింది. ఈ క్రమంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ పోటీ చేస్తున్న అభ్యర్ధుల్లో కొందరిపై కేసులు నమోదయ్యాయి. తాజాగా మాజీ క్రికెటర్, కాంగ్రెస్ పార్టీకి చెందిన జూబ్లిబిల్స్ నియోజకవర్గ అభ్యర్ధి మహ్మద్ అజారుద్దీన్(Mohammad Azharuddin) పై ఫిల్మ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అజారుద్దీన్ పై కేసు..
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామనీ, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఎన్నికల సంఘం (ఈసీ) ముందుగానే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జూబ్లిహిల్స్ అభ్యర్ధి మహ్మద్ అజారుద్దీన్ కు షాక్ ఇచ్చింది. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారనే కారణంతో ఆయనపై ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.
ఇదిలాఉంటే.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా అజారుద్దీన్ బరిలో ఉండగా.. బీఆర్ఎస్ తరపున మాగంటి గోపినాథ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి, ఎంఐఎం పార్టీ తరపున మొహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్ పోటీలో నిలిచారు. ఈ నేపథ్యంలో అజారుద్దీన్‌పై కేసు కావడంతో ఆ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.