Telangana Assembly Elections: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానునున్నది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. అయితే.. కొన్ని నియోజక వర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగనున్నది. అంటే గంట ముందే పోలింగ్ ముగియనున్నది. ఇంతకీ ఆ నియోజక వర్గాలేంటి? ఎందుకు గంట ముందే ఎన్నికల పోలింగ్ పూర్తి చేయడానికి కారణమేంటీ.?
Telangana Assembly Elections: మరికొన్ని గంటల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Polling) ప్రారంభం కానునున్నది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. రాష్ట్రంలోని 13 సున్నిత కేంద్రాల్లో మాత్రం ఒక గంట ముందే పోలింగ్ ముగియనున్నది. అంటే.. సాయంత్రం 4గంటలకే పోలింగ్ ప్రక్రియ ముగియనున్నది.
ఇక రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 2,290 మంది అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. ఇక ఈ ఎన్నికల్లో మొత్తం 3,26,02,799 మంది ఓటర్లు ఉండగా.. అందులో పురుష ఓటర్లు 1,62,98,418 మంది, మహిళా ఓటర్లు 1,63,01,705 మంది తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు. ఈ తరుణంలో ఎన్నికల కమిషన్ మొత్తం 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. పోలింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. ప్రశాంతంగా జరిపేందుకు తీసుకోవాల్సిన అన్నీ చర్యలు తీసుకున్నారు అధికారులు. పోలింగ్ సందర్బంగా భద్రతా విధుల్లో 45వేల మంది తెలంగాణ పోలీసులు ఉండనున్నారు. పోలింగ్‌కు 48 గంటల ముందే రాష్ట్రమంతటా 144 సెక్షన్ అమల్లోకి వస్తుందని, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు.. సమావేశాలు, ఇంటింటి ప్రచారం లాంటివి చేయవద్దని ఈసీ సూచించింది.
undefined
ఆ 13 నియోజకవర్గాల్లో గంట ముందే క్లోజ్..
రాష్ట్రంలోని 13 నియోజకవర్గాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించింది ఎన్నికల కమిషన్. అందులో సిర్పూర్ కాగజ్‌నగర్, చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజక వర్గాల్లో పోలింగ్ గంట ముందుగానే ముగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అంటే..ఈ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ముగుస్తుంది. ఈ తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక ద్రుష్టి సారించినట్టు తెలుస్తోంది.