మెదక్ జిల్లాలో సర్పంచ్ బరితెగింపు.. వాట్సాప్ స్టేటస్‌గా గ్రామంలోని మహిళ ఫొటో.. ప్రశ్నిస్తే బెదిరింపులు..

Published : May 05, 2023, 01:27 PM IST
మెదక్ జిల్లాలో సర్పంచ్ బరితెగింపు.. వాట్సాప్ స్టేటస్‌గా గ్రామంలోని మహిళ ఫొటో.. ప్రశ్నిస్తే బెదిరింపులు..

సారాంశం

మెదక్ జిల్లా రంగాయపల్లి సర్పంచ్ నిర్వాహకం తీవ్ర విమర్శలకు దారితీసింది. మహిళా కాపురంలో నిప్పులు  పోసే విధంగా బరితెగింపు చర్యలు పాల్పడటంపై స్థానికులు మండిపడుతున్నారు.

మెదక్ జిల్లా రంగాయపల్లి సర్పంచ్ నిర్వాహకం తీవ్ర విమర్శలకు దారితీసింది. మహిళా కాపురంలో నిప్పులు  పోసే విధంగా బరితెగింపు చర్యలు పాల్పడటంపై స్థానికులు మండిపడుతున్నారు. వివరాలు.. గ్రామానికి చెందిన ఓ మహిళ ఫొటోను సర్పంచ్ తన వాట్సాప్ స్టేషస్‌గా పెట్టుకున్నారు. ఆ ఫొటోపై ఐ లవ్ యూ అని కూడా రాశాడు. అయితే ఇదేమిటని ప్రశ్నించిన మహిళా భర్తపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే మహిళా భర్త పోలీసులకు ఆశ్రయించాడు. దీంతో సర్పంచ్‌పై మనోహరబాద్ పోలీసు  స్టేషన్‌లో 67/ఏ, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి విచారణ చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్