అసదుద్దీన్ పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు: బీజేవైఎం నేత లడ్డూ యాదవ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Published : Aug 18, 2022, 12:42 PM IST
 అసదుద్దీన్ పై  రెచ్చగొట్టే వ్యాఖ్యలు: బీజేవైఎం నేత లడ్డూ యాదవ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

సారాంశం

హైద్రాబాద్ ఎంపీ అసదుద్దీన్  ఓవైసీని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన కేసులో బీజేవైఎం నేత లడ్డూ యాదవ్ ను అఫ్జల్ గంజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లడ్డూ యాదవ్ పై ఇప్పటికే ఈ విషయమై కేసులు నమోదయ్యాయి

హైదరాబాద్: హైద్రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేత లడ్డూ యాదవ్  ను గురువారం నాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ  నెల 15వ  తేదీన బేగం బజార్ లో  హైద్రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేత లడ్డూ యాదవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై లడ్డూ యాదవ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.అఫ్జల్ గంజ్  పోలీస్ స్టేషన్ ఎస్ఐ వీరబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లడ్డూ యాదవ్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. 

ఆగస్టు 15న పోలీసుల నుండి అనుమతి లేకుండానే బేగంబాజర్ ఛత్రిలోని భగీరథ పూజా దుకాణం ముందు వేదికను నిర్మించారు. ఇవాళ ఉదయం 10 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభించారు.  రోడ్డును దిగ్భందించారు. అదే సమయంలో ఈ మార్గంలో వెళ్తున్న హైద్రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని ఉద్దేశించి లడ్డూ యాదవ్  వ్యాఖ్యలు చేశారని ఆయనపై కేసు నమోదైంది.ఐపీసీ 341, 188 , 504 సెక్షన్ల మేరకు కేసులు నమోదు చేశారు. ఇవాళ ఉదయం లడ్డూ యాదవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : టమాటా టార్గెట్ సెంచరీ..? మిర్చీ హాఫ్ సెంచరీ..? : హైదరాబాద్ లో ఏ కూరగాయ ధర ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : చలి తగ్గినా ఈ ప్రమాదం ఇంకా పొంచివుంది.. తస్మాత్ జాగ్రత్త