కారణమిదీ: యాదాద్రి గద్దరాళ్లతండాలో పోలీసులపై గ్రామస్తుల దాడి

By narsimha lodeFirst Published Jan 29, 2023, 11:15 AM IST
Highlights

యాద్రాద్రి జిల్లా  బొమ్మలరామారం  గద్ద రాళ్ల తండాలో  పోలీసులపై గ్రామస్తులు దాడికి దిగారు.  ఆదివారం నాడు  తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.  
 

బొమ్మలరామారం: యాదాద్రి జిల్లా బొమ్మలరామారం  మండలం గద్దరాళ్లతండాలో  పోలీసులపై గ్రామస్తులు  ఆదివారం నాడు తెల్లవారుజామున దాడికి దిగారు  దొంగలుగా భావించిన  గ్రామస్తులు  పోలీసులపై దాడి చేశారు. ఈ నెల  23న రాత్రి  మేడ్చల్  జిల్లాలోని  షామీర్ పేట  పోలీస్ స్టేషన్ పరిధిలో ని ఉద్దెమర్రి వైన్స్ షాప్ వద్ద   దుండగులు కాల్పులకు దిగి  రూ. 2 లక్షలను దోచుకెళ్లారు.  ఈ ఘటనకు సంబంధించి  పోలీసులు విచారణ చేస్తున్నారు.ఈ దర్యాప్తులో  భాగంగా  నిన్న రాత్రి  గద్దరాళ్ల తండాకు  పోలీసులు  వెళ్లారు.  అర్దరాత్రి పూట  తండాకు వచ్చిన పోలీసులను దొంగలుగా భావించిన  గ్రామస్తులు  పోలీసులపై దాడికి దిగారు.  అయితే తాము  పోలీసులమని  గ్రామస్తులకు  పోలీసులు  చెప్పారు. దీంతో గ్రామస్తులు  వారిని వదిలిపెట్టారు.   

also read:మేడ్చల్ జిల్లాలో వైన్స్ దుకాణం వద్ద కాల్పులు: రూ. 2 లక్షలు దోచుకున్న దుండగులు

ఈ నెల  23వ తేదీ రాత్రి  ఉద్దెమర్రిలో  వైన్స్ షాపు  వద్ద  ముగ్గురు వ్యక్తులు  వచ్చారు. వైన్స్ షాప్  యజమాని  బాలకృష్ణ , జైపాల్ రెడ్డిని  బెదిరించి  రూ. 2 లక్షలను దోచుకున్నారు. డబ్బు సంచిని    దుండగులు దోచుకెళ్లకుండా బాలకృష్ణ,   జైపాల్ రెడ్డిలు చివరి నిమిషం వరకు  ప్రయత్నించారు.   కానీ తుపాకీతో   బెదిరించారు. బాలకృష్ణపై  దుండగులు కాల్పులు జరిపారు.  ఈ కాల్పుల నుండి  బాలకృష్ణ తప్పించుకున్నారు. ఈ తుపాకీ నుండి  వచ్చిన బుల్లెట్ మద్యం దుకాణం  షట్టర్ కు తగిలింది. 
 

click me!