హైద్రాబాద్‌లో దారుణం: డ్రైవర్‌ను కొట్టి క్యాబ్‌ ను ఎత్తుకెళ్లిన దుండగులు

Published : Apr 07, 2023, 10:22 AM ISTUpdated : Apr 07, 2023, 04:46 PM IST
  హైద్రాబాద్‌లో దారుణం: డ్రైవర్‌ను కొట్టి  క్యాబ్‌ ను ఎత్తుకెళ్లిన దుండగులు

సారాంశం

హైద్రాబాద్ లో క్యాబ్  ను దొంగిలించారు  దుండగులు.   పథకం ప్రకారం   క్యాబ్ ను బుక్  చేశారు.  నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి  డ్రైవర్ ను బెదిరించి  క్యాబ్ ను ఎత్తుకెళ్లారు.

హైదరాబాద్: నగరంలోని  పహడీషరీఫ్ లో  దారుణం చోటు చేసుకుంది.  డ్రైవర్ ను  కొట్టి  క్యాబ్ ను ఎత్తుకెళ్లారు దుండగులు.  హైద్రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో  దుండగులు క్యాబ్ ను  బుక్ చేసుకున్నారు.  బాలాపూర్ లోని నిర్మానుష్య ప్రాంతానికి క్యాబ్ ను తీసుకెళ్లారు దుండగులు. క్యాబ్ డ్రైవర్ ను  కత్తితో  బెదిరించి  క్యాబ్ ను ఎత్తుకెళ్లారు దుండగులు .

శంషాబాద్ ఎయిర్ పోర్టులో  ఇద్దరు ప్రయాణీకులు  క్యాబ్ ను బుక్ చేసుకున్నారు.  శంషాబాద్ ఎయిర్ పోర్టును  బాలపూర్ కు సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లిన సమయంలో  కారులోని ప్రయాణీకులు  గురువారంనాడు రాత్రి   క్యాబ్ డ్రైవర్ ను బెదిరించారు.   క్యాబ్ డ్రైవర్  మీర్జా ఆజం బేగ్ పై దాడి చేశారు.పహాడీషరీఫ్  పోలీస్ స్టేషన్ పరిధిలోని  నిర్మానుష్య ప్రాంతానికి  కారు  వెళ్లిన  సమయంలో క్యాబ్ లో ముందు సీట్లో  కూర్చున్న వ్యక్తి  డ్రైవర్ పై దాడి చేశాడు.  

నిర్మానుష్య ప్రాంతంలో  వాహనం నిలిపేందుకు  డ్రైవర్ నిరాకరించారు.  నిందితులు దాడి  చేస్తున్న  సమయంలో  డ్రైవర్ కారు నుండి  కిందకు దూకాడు. దీంతో  నిందితులు  కారును  ఎత్తుకెళ్లారు.  డ్రైవర్  తలపై  గాయమైంది. దీంతో  అతను  ప్రైవేట్ ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్నాడు. ఈ విషయమై  బాధితుడు  పోలీసులకు  ఫిర్యాదు  చేశాడు .    

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం