హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ పరిధిలో కాలిపోయిన స్థితిలో మృతదేహం.. క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు..?

Published : Oct 24, 2022, 01:36 PM IST
హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ పరిధిలో కాలిపోయిన స్థితిలో మృతదేహం.. క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు..?

సారాంశం

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పరిధిలో దారుణం చోటుచేసకుంది. శశ్మాన వాటిక వద్ద కాలిపోయిన స్థితిలో మృతదేహం కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది.

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పరిధిలో దారుణం చోటుచేసకుంది. శశ్మాన వాటిక వద్ద కాలిపోయిన స్థితిలో మృతదేహం కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. వివరాలు.. కేపీహెచ్‌బీ పోలీసు స్టేషన్ పరిధిలోని హైదర్‌నగర్‌లో శ్మశాన వాటిక వద్ద గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని హత్య చేసి మృతదేహాన్ని కాల్చివేశారు. కాలిపోయిన స్థితిలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. 

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే మృతదేహానికి సమీపంలో క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆనవాళ్లు కనిపించడం కలకలం రేపుతోంది. రేపు అమవాస్య, సూర్యగ్రహణం కావడంతో ఇక్కడ బలి ఇచ్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. క్లూస్ టీమ్ ఘటన స్థలంలో ఆధారాలు సేకరిస్తుంది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహం ఎవరిదో గుర్తించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే గత రాత్రి ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే