ఫొటోలు మార్పింగ్ చేసి లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు.. వనపర్తిలో యువకుడు ఆత్మహత్య..

By Sumanth KanukulaFirst Published Oct 24, 2022, 12:35 PM IST
Highlights

లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు ఆగడం లేదు. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టిన వారు మాత్రం బెదరడం లేదు. తాజాగా లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు.. మరో యువకుడి ప్రాణాన్ని బలిగొన్నాయి.

లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు ఆగడం లేదు. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టిన వారు మాత్రం బెదరడం లేదు. తాజాగా లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు.. మరో యువకుడి ప్రాణాన్ని బలిగొన్నాయి. ఈ ఘటన తెలంగాణలోని వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. వివరాలు.. కొత్తకోటకు చెందిన శేఖర్.. కొంతకాలం కిందట లోన్ యాప్‌ ద్వారా కొంత డబ్బు తీసుకనున్నారు. కొద్ది రోజులకు దానిని తీర్చేశాడు. అయితే ఇంకా డబ్బులు చెల్లించాల్సి ఉందని.. లోన్ యాప్‌ నిర్వాహకులు శేఖర్‌ను వేధించడం మొదలుపెట్టారు. 

ఈ క్రమంలో శేఖర్ ఫొటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన శేఖర్.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే శేఖర్ మృతికి లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులే కారణమని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.  ఈ ఘటనకు సంబంధించి శేఖర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని చెప్పారు. 

click me!