సీసీ కెమెరాలకు పొగబెట్టి.. ఏటీఎంలో చోరీ.. ఆపై...

By AN TeluguFirst Published Feb 9, 2021, 1:48 PM IST
Highlights

నల్గొండ జిల్లా చిట్యాలలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా ఏటీఎం సీసీ కెమెరాలకు పొగబెట్టి చోరీకి పాల్పడ్డారు. జాతీయ రహదారిని ఆనుకుని ఏర్పాటు చేసిన ఏటీఎంల కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఆదివారం అర్ధరాత్రి ఓ ఏటీఎంలో చోరీ చేశారు. 
 

నల్గొండ జిల్లా చిట్యాలలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా ఏటీఎం సీసీ కెమెరాలకు పొగబెట్టి చోరీకి పాల్పడ్డారు. జాతీయ రహదారిని ఆనుకుని ఏర్పాటు చేసిన ఏటీఎంల కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఆదివారం అర్ధరాత్రి ఓ ఏటీఎంలో చోరీ చేశారు. 

అందులోంచి రూ.7.12 లక్షలు ఎత్తుకెళ్లారు. మరో ఏటీఎంలో కూడా చోరీకి విఫలయత్నం చేశారు. ఎస్‌ఐ రావుల నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ బస్ స్టేజీ వద్ద నిలిపి ఉంచిన ఓ కారును దొంగిలించిన దుండగులు పట్టణంలోని ఎస్ బీఐ ఏటీఎం సెంటర్ కు చేరుకున్నారు. 

ఆ ఏటీఎంలోని సీసీ కెమెరాలైకి పొగను పంపి మెషీన్‌ను ధ్వంసం చేశారు. అదే సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్ వాహనం రావడంతో వారు తమ ప్రయత్నాన్ని విరమించుకుని కారులో పరారయ్యారు. 

ఏటీఎంలో చోరీకి జరిగిన ప్రయత్నాన్ని గుర్తించిన పోలీసులు వెంటనే తేరుకుని జాతీయ రహదారి వెంట ఉన్న ఏటీఎంలను పరిశీలించారు. ఈ సందర్భంగా వెలిమినేడు గ్రామంలో ఇండిక్యాష్ ఏటీఎంలో చోరీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. 

క్యాష్‌ ర్యాక్‌లను బయటికి తీసిన దుండగులు అందులోని రూ.7.12 లక్షలను అపహరించారు. చోరీ తరువాత దుండగులు వాహనాలను అపహరించి అందులో ప్రయాణించారు. 

మొదట వట్టిమర్తి లో అపహరించిన ఇండికా కారులో వెలిమినేడు వరకు వచ్చిన దుండగులు అక్కడే దానిని వదిలేశారు. అనంతరం వెలిమినేడుకు చెందిన సంగప్ప అనే వ్యక్తి క్వాలిస్‌ వాహనాన్ని దొంగిలించి పంతంగి టోల్‌ప్లాజా వద్దకు చేరుకుని దానిని కూడా అక్కడే వదిలి పరారయ్యారు. చోరీకి రెండు బృందాలుగా వచ్చి నట్లు పోలీసులు భావిస్తున్నారు.

click me!