రాజన్న రాజ్యం మనతోనే సాధ్యం: షర్మిల

Published : Feb 09, 2021, 01:30 PM IST
రాజన్న రాజ్యం మనతోనే సాధ్యం: షర్మిల

సారాంశం

  రాజన్న రాజ్యం మళ్లీ మళ్లీ రావాలనేది నా కోరిక.. అది మనతోనే సాధ్యమని తాను నమ్ముతున్నట్టుగా షర్మిల ధీమాను వ్యక్తం చేశారు.

హైదరాబాద్:  రాజన్న రాజ్యం మళ్లీ మళ్లీ రావాలనేది నా కోరిక.. అది మనతోనే సాధ్యమని తాను నమ్ముతున్నట్టుగా షర్మిల ధీమాను వ్యక్తం చేశారు.మంగళవారం నాడు లోటస్‌పాండ్ లో నల్గొండ జిల్లాకు చెందిన వైఎస్ఆర్ అభిమానుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు.

రాజన్న రాజ్యంలో ప్రతి రైతు ఒక రాజులా బతికారని ఆమె చెప్పారు. పేదవాడికి పక్కా ఇళ్లు ఉండాలనేది రాజశేఖర్ రెడ్డి ఆశయమని ఆమె గుర్తు చేశారు. పేద విద్యార్ధి గొప్ప ఉద్యోగం చేయాలన్నదే రాజన్న రాజ్యం లక్ష్యంగా ఆమె పేర్కొన్నారు.

also read:వైఎస్ఆర్ లేని లోటు తెలంగాణలో ఉంది: షర్మిల

పేదరికం ఒక శాపమని అనారోగ్యం వస్తే అప్పుల పాలు అవుతారని రాజన్న నమ్మారని ఆమె చెప్పారు.రాజన్న రాజ్యం మళ్లీ రావాలన్నదే తన కోరికగా ఆమె చెప్పారు.అది మనతోనే సాధ్యమని నా నమ్మకం అని ఆమె తెలిపారు. 

రాజశేఖర్ రెడ్డి మనల్ని వదిలి వెళ్లిపోయి 8 ఏళ్లు దాటింది, అయినా ఆయన ఇంకా మన మనసులోనే ఉన్నారన్నారు. రాజన్న బిడ్డగా తాను ఒక్క పిలుపు ఇవ్వగానే మీరంతా వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

రాజన్న సువర్ణ పాలన గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మీ ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను అర్ధం చేసుకొనేందుకు తాను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. తాను మాట్లాడేందుకు రాలేదు... మీ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులను వినేందుకు వచ్చానని షర్మిల తెలిపారు.

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Pressmeet: కేంద్రంపై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu
అమెరికాకు అందుకోసమే వెళ్లాలనుకున్నా.. కానీ అడ్డుకున్నారు : సీఎం రేవంత్ రెడ్డి