విషాదం.. వరద నీటిలో బీటెక్ విద్యార్థిని గల్లంతు

By telugu news teamFirst Published Oct 14, 2020, 5:35 PM IST
Highlights

గల్లంతైన విద్యార్థిని కోసం గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం విగత జీవిగా దర్శన మిచ్చింది. వైష్ణవి మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వరద నీటిలో ఓ బీటెక్ విద్యార్థిని మృతి చెందింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ వర్షాలకు భారీగా వరదలు పొంగి పొర్లుతున్నాయి. ఈ వరదల్లో చిక్కుకొని ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది.

మంగళవారం పోచంపల్లి- కొత్తగూడెం మార్గం మధ్యలో బీటెక్‌ విద్యార్థిని భోగ వైష్ణవి(17) వరద నీటిలో గల్లంతైంది. గల్లంతైన విద్యార్థిని కోసం గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం విగత జీవిగా దర్శన మిచ్చింది. వైష్ణవి మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

కాగా, తెలంగాణలో వర్ష బీభత్సానికి దాదాపు 12 మంది మరణించగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునగగా.. పలు నదులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు, పలు ప్రాంతాలు, కాలనీలు వాగులను తలపిస్తున్నాయి. వీధుల్లోని కార్లు, ఆటోలు, బైక్‌లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
 

click me!