హైద్రాబాద్ అస్మత్ పేట లేక్‌లో వ్యక్తి గల్లంతు

Published : Oct 14, 2020, 05:27 PM IST
హైద్రాబాద్ అస్మత్ పేట లేక్‌లో వ్యక్తి గల్లంతు

సారాంశం

హైద్రాబాద్ నగరంలోని అస్మత్‌పేట చెరువులో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఆయనను కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకుండాపోయింది. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలోని అస్మత్‌పేట చెరువులో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఆయనను కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకుండాపోయింది. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

అస్మత్ పేట లేక్ వరద నీటిలో ఓ వ్యక్తి కొట్టుకుపోతున్నాడు. అయితే నీటి మధ్యలో దొరికిన వస్తువును ఆసరాగా చేసుకొని పట్టుకొన్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానిక యువకులు అతడిని రక్షించేందుకు ఓ కర్రను  అతడికి అందించేందుకు ప్రయత్నించారు.

అయితే  ఆ కర్ర అందుకొనేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించాడు. వరద ఉధృతి ఎక్కువ కావడంతో ఆ వ్యక్తి కొట్టుకుపోయాడు. వరద నీటిలో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

also read:హుస్సేన్‌సాగర్‌కు పోటెత్తిన వరద: లెవల్‌ను దాటి చేరిన నీరు

హైద్రాబాద్ శివారులో 32 సెం.మీ వర్షపాతం నమోదైంది. నగరంలోని పలు చోట్ల 24 సెం.మీ. పైగా వర్షపాతం నమోదైంది. ఈ వర్షానికి పాతబస్తీలో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

తాజాగా అస్మత్ పేట లేక్ లో మరో వ్యక్తి గల్లంతయ్యాడు. నగరంలోని పలు కానీల్లో భారీగా వరద నీరు చేరింది. పలు కాలనీల్లో విద్యుత్ నిలిచిపోయింది.
 

PREV
click me!

Recommended Stories

మీకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? మీకో బ్యాడ్ న్యూస్‌, క్యాష్‌లెస్ చికిత్స‌ల‌కు తాత్కాలిక్ బ్రేక్
కొత్త ఇంటికి కరెంట్ మీట‌ర్ ఎలా తీసుకోవాలి? అవసరమైన పత్రాలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు