చచ్చిపోతే ఎలా ఉంటుందో..? గూగుల్ లో సెర్చ్ చేసి మరీ..

By telugu news teamFirst Published Feb 19, 2020, 11:41 AM IST
Highlights

 నైట్రోజన్‌ ఆక్సిజన్‌ సిలిండర్‌ పైపులను ముక్కులోకి పెట్టుకొని రసాయన వాయువులు బయటికి రాకుండా తన శరీరంలోకి వెళ్లేలా ముఖాన్ని పాలిథిన్‌ కవర్లతో గట్టిగా చుట్టుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

చనిపోతే ఎలాం ఉంటుందో తెలుసుకోవాలని ఓ బీటెక్ స్టూడెంట్ తెలుసుకోవాలని అనుకున్నాడు.  అందుకోసం గూగుల్ లో సెర్చ్ చేసి మరీ చిత్ర విచిత్రంగా ఆత్మహత్య  చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... నగరానికి చెందిన గణేష్... ఓ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. గత వారం పది రోజులుగా సులభంగా చనిపోవడం ఎలా అనే విషయంపై గూగుల్ లో సెర్చ్ చేశాడు. అనంతరం వాటిల్లో ఒకదానిని సెలక్ట్ చేసుకున్నాడు.  

ఇందులో భాగంగానే ఎర్రగడ్డలోని ఓ గ్యాస్‌ ఏజెన్సీస్‌లో ఈ నెల 14న రూ.3,154 వెచ్చించి సిలిండర్‌ను, పైపులు, పాలిథిన్‌ కవర్లు కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకున్నాడు. ఇంట్లోని స్టోర్‌ రూంలో వీటిని భద్రపరిచాడు. నైట్రోజన్‌ ఆక్సిజన్‌ సిలిండర్‌ పైపులను ముక్కులోకి పెట్టుకొని రసాయన వాయువులు బయటికి రాకుండా తన శరీరంలోకి వెళ్లేలా ముఖాన్ని పాలిథిన్‌ కవర్లతో గట్టిగా చుట్టుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Also Read పౌరసత్వం నిరూపించుకోండి... హైదరబాదీలకు ఆధార్ షాక్...

చనిపోయిన తర్వాత ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాను.. అని సూసైడ్ లెటర్  రాసి మరీ ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.  గణేష్‌ మొదటి సంవత్సరంలోనే పరీక్షలు సరిగా రాయకపోవడంతో డిటెండయ్యాడు. మరోసారి పరీక్షలు రాసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. 

దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ కారణంతోనే ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని అతని స్నేహితులు చెబుతున్నారు. కాగా ఒక్కగానొక్క కుమారుడు ఇలా జీవితాన్ని అర్థాంతరంగా ముగించడం పై కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
 

click me!