పెళ్లికావట్లేదని మనస్తాపం... ఫ్రెండ్ కి మెయిల్ చేసి...

Published : Feb 19, 2020, 09:32 AM IST
పెళ్లికావట్లేదని మనస్తాపం... ఫ్రెండ్ కి మెయిల్ చేసి...

సారాంశం

కొంతకాలంగా అతను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నా అతనికి సరైన సంబంధం దొరకడం లేదు. దీంతో డిప్రెషన్ కి గురయ్యాడు. ఈ క్రమంలో నాగోల్ లో ఉంటున్న తన స్నేహితుడు సంపత్ కి చచ్చిపోతున్నానంటూ మెయిల్ చేశాడు.   

మూడు పదుల వయసు దాటినా ఇంకా ఒంటరి జీవితం సాగించలేకపోయాడు. పెళ్లి కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో తట్టుకోలేకపోయాడు. తన ఫ్రెండ్ కి చనిపోతున్నా అంటూ మెయిల్ చేసి... ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గచ్చిబౌలిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... శ్రీకాకుళం జిల్లాలోని జి సిగడాం ప్రాంతానికి చెందిన పీఎన్ వీ ఎస్ సన్నిబాబు(33) కొంతకాలంగా సుదర్శనగర్ కాలనీలో నివాసముంటూ నగరంలోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు.

Also Read ఫ్రెండ్ పుట్టినరోజుకని వెళ్లి... రక్త మడుగులో తేలాడు...

కొంతకాలంగా అతను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నా అతనికి సరైన సంబంధం దొరకడం లేదు. దీంతో డిప్రెషన్ కి గురయ్యాడు. ఈ క్రమంలో నాగోల్ లో ఉంటున్న తన స్నేహితుడు సంపత్ కి చచ్చిపోతున్నానంటూ మెయిల్ చేశాడు. 

అదే రోజు సాయంత్రం కాస్త ఆలస్యంగా మొయిల్ చూసుకున్న సంపత్ కుమార్... వెంటనే సన్నిబాబు ఇంటికి చేరుకున్నాడు. తలపులు మూసి ఉండటంతో.. బలవంతంగా తెరచి చూశాడు. లోపలికి వెళ్లి చూడగా  సన్నిబాబు ఫ్యాన్ కి ఉరివేసుకొని కనిపించాడు. కిందకి దించి చూడగా... అప్పటికే మృతి చెందాడు. పోలీసులు సంఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు.

మృతదేహాన్ని శపరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పెళ్లి కావడం లేదనే బాధతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్