బంగారు చీరలు మీకు-బతుకమ్మ చీరలు మాకా..: కేసీఆర్ పై ఆర్ఎస్ ప్రవీణ్ సెటైర్లు (వీడియో)

By Arun Kumar PFirst Published Sep 27, 2021, 10:26 AM IST
Highlights

జగిత్యాల జైత్రయాత్ర పేరుతో బహుజన సమాజ్ వాది పార్టి నిర్వహించిన కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై ఆయన విరుచుకుపడ్డారు. 

జగిత్యాల: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బిఎస్పీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar). జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాజ్యాధికారానికై బహుజన్ పార్టీ(BSP) జైత్రయాత్ర కార్యక్రమంలో ప్రవీణ్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ... తమ అధినేత్రి మాయావతి కలలు నిజం చేయడానికి తన జీవితాన్ని వదిలేసి దేశం మొత్తం తిరుగుతానని అన్నారు. జగిత్యాల జిల్లా ప్రజలను ఏనుగు మీద కూర్చోబెట్టి వయా సిరిసిల్ల మీదుగా ప్రగతి భవన్ కు వెళతానని అన్నారు. 

''సీఎం కేసిఆర్ బంగారు చీరలు-బతుకమ్మ చీరలు మాకా, ఓట్లు మావి‌-సీట్లు మీకా, కాంట్రాక్టులు, కమిషన్లు మీకు-కన్నీళ్లు మాకా. కరోన విపత్కర పరిస్థితుల్లో మీరు ఎన్ని సార్లు గాంధీ ఆసుపత్రికి పోయారు... ఎన్నిసార్లు అడ్మిట్ అయ్యారు. మీకు కార్పొరేట్ హాస్పిటల్స్‌ - మాకేమో గల్లీ దవాఖానలా'' అని నిలదీశారు. 

read more  సీఎం కుర్చీపై హరీష్ కన్ను.. ఈటల షాకింగ్ కామెంట్స్

''తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు పూర్తయినా నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు రాలేవు. గత 6నెలల నుండి 50 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని అంటున్నారు... వాటిని ఎందుకు భర్తీ చేయడం లేదు'' అని ప్రవీణ్ ప్రశ్నించారు. 

వీడియో

"

''హుజురాబాద్ లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై కక్ష కట్టారు... అందుకే కేవలం అతడిని ఓడించడానికే ఆ ఒక్క నియోజకవర్గంలోనే రెండువేల కోట్ల రూపాయలు  ఖర్చు చేస్తున్నారు. ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కి అనురాగ్ యూనివర్సిటీ, మంత్రి మల్లారెడ్డికి మరో యూనివర్సిటీ ఇచ్చారు. కానీ నిరుపేద బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునే ప్రభుత్వ యూనివర్సిటీలపై కక్షగట్టి టీచింగ్ స్టాప్ ను భర్తీ చేయడంలేదు'' అని ఆరోపించారు.

''మంత్రి కొప్పుల ఈశ్వర్ కు  మీ పార్టీలో అవమానం జరిగినా బందీగా ఉన్నారు. మీరు లక్షల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు? ఆ సీక్రెట్ లు మాకు చెప్పండి సీఎం గారు. తెలంగాణ లో గడిల పాలన అంతం కావాలంటే ఏనుగు గుర్తుకే ఓటు వేయాలి'' అని ప్రవీణ్ జగిత్యాల ప్రజలను కోరారు. 
 

click me!