Telangana

ఇంటికి వెళ్లకుండా... హత్యకు కారణమేమిటి.. (వీడియో)

16, Jan 2019, 11:02 AM IST

హైదరాబాద్ చార్మినార్ ఏరియాలో భగవాన్ దేవి ఆస్పత్రి సమీపంలో అందరూ చూస్తుండగా రవి అనే వ్యక్తిపై దుండగులు దాడి చేశారు. ఈ దాడిని కొంత మంది స్థానికులు తమ ఫోన్లలతో చిత్రీకరించారు.మృతుడిని 42 ఏళ్ల రవిగా గుర్తించారు పోలీసులు. ప్రాణాలు దక్కించుకునే క్రమంలో రవి పరుగులు తీశాడు. దుండగులు అతడిని వెంటాడి కత్తులతో దాడి చేశారు. అందరూ చూస్తుండగా అత్యంతక కిరాతకంగా హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారు. 

పోలీసులు,క్లూస్ టీమ్స్ స్పాట్ కు చేరుకున్నారు. నిందితులకు సంబంధించి ఆధారాలను సేకరించారు పోలీసులు.మృతుడు రవి కుటుంబం పాతబస్తీ లొనే ఉంటుంది.ఐతే కొన్ని రోజులు అతను ఇంటికి వెళ్లకుండా ఓ గుళ్లో ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. అతని అక్క, బావను.. పోలీసులు పిలిపించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పాత కక్షలతో ప్రత్యర్థులే రవిని హత్య చేశారా.. లేక మరే దైనా కారణం వుందా..అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.