KTR vs REVANTH REDDY: "ముఖ్యమంత్రే అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటు.."

Published : Feb 03, 2024, 04:35 AM IST
KTR vs REVANTH REDDY:  "ముఖ్యమంత్రే అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటు.."

సారాంశం

KTR vs REVANTH REDDY: కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి విమర్శలు గుప్పించారు. ఇతరులు చేసిన పనిని తామే చేసినట్టు కాంగ్రెస్‌ క్రెడిట్‌ను దొంగిలించే ప్రయత్నం చేస్తుందనీ, ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదని, చివరిది కూడా కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటు మండిపడ్డారు. అసలేం జరిగిందంటే.? 

KTR vs REVANTH REDDY:  మరోసారి కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. ఇతరులు చేసిన పనిని తామే చేసినట్టు కాంగ్రెస్‌ క్రెడిట్‌ను దొంగిలించే ప్రయత్నం చేస్తుందనీ, ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదని, చివరిది కూడా కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పనులు చేయకున్నా..  తామే చేశామని ప్రజలను మోసం చేయాలనుకుంటోందని విమర్శించారు. నూతన ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటు మండిపడ్డారు. 

అసలేం జరిగిందంటే..? 

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 7 వేల మంది స్టాఫ్ నర్సులకు ఉద్యోగాలు కల్పించామని, రానున్న 15 రోజుల్లో 15 వేల మంది కానిస్టేబుళ్లను నియమిస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన ఫై కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.  15,000 మందికి పైగా కానిస్టేబుళ్లు, దాదాపు 7,000 మంది స్టాఫ్ నర్సుల రిక్రూట్‌మెంట్‌ను కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేసిందని పేర్కొంటూ.. ఈ రెండు కార్యక్రమాలను తామే పూర్తి చేశామని కాంగ్రెస్ క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఈ విషయాన్ని కేటీఆర్ తన అధికారిక ఖాతా నుంచి ట్వీట్ ద్వారా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ పార్టీకి ఇలాంటి నీచమైన పనులు చేయడం కొత్తేమీ కాదని, కేసీఆర్‌ ప్రభుత్వమమే 6,956 మంది స్టాఫ్‌ నర్సులు, 15,750 మంది పోలీసు కానిస్టేబుళ్ల నియామకాలను పూర్తి చేసిందని కేటీఆర్‌ ఉద్ఘాటించారు. ఎన్నికల కోడ్ కారణంగా ముందుగా ఫలితాలు ప్రకటించలేకపోయామని విచారం వ్యక్తం చేశారు. ఈ విజయాలు తమదేనంటూ రేవంత్ సర్కార్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, కొత్త ముఖ్యమంత్రి అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటని కేటీఆర్ విమర్శించారు.

కేసీఆర్ హయాంలోనే 15,750 మంది కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్ జరిగిందని రుజువు చేసేందుకు అక్టోబర్ 5, 2023 నాటి టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదికను కూడా ఆయన ప్రస్తావించారు. ఇంకా, అతను తన ప్రకటనకు మద్దతుగా నర్సుల నియామకానికి సంబంధించి ఆగస్టు 7, 2023 నుండి ప్రభుత్వ ఉత్తర్వు (GO)ని జతపరిచాడు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : తెలంగాణపై చలి పంజా.. ఈ జిల్లాల్లో వచ్చే పదిరోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు
Medicover Hospitals: అరుదైన అకలేషియా కార్డియాకు POEM చికిత్స.. 61 ఏళ్ల మహిళకు కొత్త జీవితం !