KTR: ఫార్ములా ఈ-రేస్‌ రద్దు.. రేవంత్ సర్కార్ పై కేటీఆర్‌ కీలక  వ్యాఖ్యలు 

By Rajesh Karampoori  |  First Published Jan 7, 2024, 3:27 AM IST

E-Prix regressive: హైదరాబాద్‌ లో జరగాల్సిన ఫార్ములా - ఈ రేస్‌ రద్దుపై మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ట్విటర్‌(ఎక్స్‌) వేదికగా స్పందించారు. ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న తిరోగమన నిర్ణయమని విమర్శించారు. 


E-Prix regressive:హైదరాబాద్ లో మరోసారి కారు రేసింగ్‌ పోటీలను చూడాలనుకున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. హైదరాబాద్‌ వేదికగా ఫిబ్రవరి 10న జరగాల్సిన ప్రతిష్ఠాత్మక స్పోర్ట్స్‌ కార్ల ఈవెంట్‌ ‘ఇ-ప్రిక్స్ ఫార్ములా- ఇ’ రేసింగ్‌ రద్దైంది. ఈ విషయాన్ని 'ఫార్ములా -ఇ' నిర్వహకులు వెల్లడించారు. తెలంగాణ లో ఏర్పాడిన కొత్త ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో  రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

హైదరాబాద్ కి బదులుగా హాంకుక్ మెక్సికో సిటీలో ఈ రేస్ నిర్వహించనున్నట్లు తెలిపింది. అదే విధంగా రేస్ నిర్వహణపై గతంలో చేసుకున్న ఒప్పందం ఉల్లంఘనపై మున్సిపల్ శాఖకు నోటీష్‌లు జారీ చేస్తామని ఫార్ములా ఈ ఆపరేషన్స్ వింగ్‌ పేర్కొం‍ది.

Latest Videos

ఫార్ములా 2  ఇ రేస్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి నిరాకరించినందుకు తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు శనివారం తీవ్రంగా విమర్శించారు. వచ్చే నెలలో హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ములా 2  రేసు రద్దు గురించి, ఫార్ములా ఇ చేసిన ప్రకటనపై ఆయన స్పందించారు.

2023, అక్టోబర్ 30న సంతకం చేసిన హోస్ట్ సిటీ ఒప్పందాన్ని నెరవేర్చకూడదని తెలంగాణ ప్రభుత్వ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ , అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (MAUD) నిర్ణయించుకున్న తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు. 

"ఇది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న పేలవమైన , తిరోగమన నిర్ణయమే. హైదరాబాద్ ఇ-ప్రిక్స్ వంటి ఈవెంట్‌లతో ప్రపంచవ్యాప్తంగా మన నగర, దేశం  బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుతాయి. ఫార్ములా ఇ-ప్రిక్స్ తీసుకురావడానికి మేము చాలా ప్రయత్నాలు,  సమయాన్ని వెచ్చించాము. గతేడాది తొలిసారిగా హైదరాబాద్ జరిగింది.  ఈ ఘనత గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి దక్కుతుంది. సుస్థిరత అనేది ఫోకస్, బజ్‌వర్డ్‌గా మారిన ప్రపంచంలో హైదరాబాద్‌ను ఆకర్షణీయంగా ప్రదర్శించడానికి EV ఔత్సాహికులు, పెట్టుబడి దారులు,  స్టార్టప్‌లను ఆకర్షిస్తూ వారం రోజుల పాటు EV సమ్మిట్‌ను నిర్వహించడానికి కేసీఆర్ ప్రభుత్వం ఫార్ములా E రేస్‌ను ఉపయోగించేందుకు చొరవ తీసుకుంది. సస్టయినబుల్‌ మొబిలిటీ సొల్యూషన్స్‌కు కేంద్రంగా రాష్ట్రాన్ని ప్రమోట్‌ చేసేందుకు తాము తెలంగాణ మొబిలిటీ వ్యాలీని కూడా ప్రారంభించినట్లు చెప్పారు”అని అతను చెప్పాడు. 

 కాగా.. గతేడాది ఫిబ్రవరిలో జరిగిన తొలి రేస్‌కు హైదరాబాద్‌ ఆతిథ్యమిచ్చింది. ప్రతిష్టాత్మకమైన రేసుకు ఆతిథ్యమిచ్చిన తొలి భారతీయ నగరం ఇది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఫార్ములా ఈ సంస్థ ఈ ప్రిక్స్‌, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్లతో కలిసి 2023, అక్టోబర్ 30న రేసింగ్‌కు సంబంధించి ఒప్పందం చేసుకున్నారు.

అయితే ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఆ ఎగ్రిమెంట్‌ రద్దు అయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఫార్ములా 2  - ఇ రేసింగ్‌ మెక్సికోకు తరలి వెళ్లి పోయింది. కాగా గతేడాది ఫిబ్రవరిలో  ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు ట్యాంక్ బండ్ వద్ద జరిగిన విషయం తెలిసిందే. 

click me!