మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు:కె. కేశవరావు

Published : Sep 19, 2023, 05:15 PM IST
మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు:కె. కేశవరావు

సారాంశం

మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీఆర్ఎస్ వంద శాతం మద్దతు ఇస్తుందని  బీఆర్ఎస్ ఎంపీ కె. కేశవరావు చెప్పారు.


న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీఆర్ఎస్ వంద శాతం మద్దతు ఇస్తుందని  ఆ పార్టీ ఎంపీ కె. కేశవరావు  చెప్పారు.మంగళవారంనాడు న్యూఢిల్లీలో  బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు మీడియాతో మాట్లాడారు.బీసీ మహిళలకు కూడ రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించామన్నారు.

2010లో కూడ మహిళా బిల్లు పెట్టినప్పుడు ఇదే డిమాండ్ వచ్చిందన్నారు. బీసీలను అణగదొక్కాలని కొన్ని పార్టీలు చూస్తున్నాయని ఆయన ఆరోపించారు.  ఇవాళ   మధ్యాహ్నం కొత్త పార్లమెంట్ భవనంలో పార్లమెంట్ ఉభయ సభలు  సమావేశమయ్యాయి.తొలుత లోక్ సభ సమావేశమైంది.లోక్ సభలో  మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర మంత్రి అర్జున్ మేఘావాల్ ప్రవేశ పెట్టారు.ఈ బిల్లుపై రేపు లోక్ సభలో చర్చ జరగనుంది.

PREV
click me!

Recommended Stories

Journalists Arrest : జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు ఏమిటీ వివాదం..?
Telangana Rains : తెలంగాణలో వర్షాలు.. సంక్రాంతి పండగవేళ వాతావరణం ఎలా ఉంటుందంటే...