
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ యాదాద్రి ఆలయాన్ని సందర్శించారు. ఈ రోజు ఉదయం శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే అనంతరం ఆమె మీడియాతో మట్లాడకుండా వెళ్లిపోయారు. అందరికీ బెస్ట్ విషెస్ అంటూ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కామెంట్ చేశారు. ఇక, ఈరోజు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ప్రసంగంతో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
ఈరోజు మధ్యాహ్నం 12.10 గంటలకు శాసనమండలి, శాసనసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. గత కొంతకాలంగా గవర్నర్ తమిళిసై, కేసీఆర్ ప్రభుత్వాల మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో.. రెండేళ్ల విరామం తర్వాత గవర్నర్ తమిళిసై శాసనమండలి, శాసనసభ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనుండటంతో ఆసక్తి నెలకొంది.