Bandla Ganesh: బీఆర్ఎస్ పార్టీ వేరే రాష్ట్రంలో ట్రై చేసుకోవచ్చు.. కేసీఆర్‌కు బండ్ల గణేష్ ఉచిత సలహా

By Mahesh K  |  First Published Jan 25, 2024, 2:39 PM IST

మాజీ సీఎం కేసీఆర్‌కు బండ్ల గణేష్ ఉచిత సలహా ఇచ్చారు. రాష్ట్రంలో సీఎం పోస్టు ఖాళీగా లేదని అన్నారు. ముఖ్యమంత్రి కావాలని అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ వేరే రాష్ట్రంలో ట్రై చేసుకోవచ్చు అని పేర్కొన్నారు.
 


KCR: సినీ నటుడు, కాంగ్రెస్ లీడర్ బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావుకు ఆయన వ్యంగ్యరీతిలో సూచనలు చేశారు. తెలంగాణలో ముఖ్యమంత్రి పోస్టు ఖాళీగా లేదని అన్నారు. మరో పదేళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని చెప్పారు. కాబట్టి, ఇప్పటికిప్పుడే ముఖ్యమంత్రి అయిపోవాలని అనుకునే వారు వేరే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని డెవలప్ చేసుకోవాలని, అక్కడే పదవులు చేపట్టుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

బండ్ల గణేష్ మాట్లాడుతున్న ఓ వీడియో ఎక్స్ (ట్విట్టర్‌లో) చక్కర్లు కొడుతున్నది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సీఎం పోస్టు ఖాళీగా లేదని వివరించారు. మళ్లీ ఎన్నికలు రావడానికి ఇంకా ఐదేళ్లు పడుతుందని అన్నారు. ఆ ఎన్నికల్లోనూ మళ్లీ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని చెప్పారు. అందులో తమకు ఏమాత్రం సందేహం లేదని పేర్కొన్నారు. కాబట్టి, అర్జంట్‌గా సీఎం అయిపోవాలని, ఇతర పదవులను చేపట్టాలని ఆతృతపడితే.. వేరే రాష్ట్రాల్లో ఆ ప్రయత్నాలు చేయాలని అన్నారు. పార్టీని కొత్తగా బీఆర్ఎస్ అని పెట్టుకున్నారు కదా.. భారత రాష్ట్ర సమితి అని మార్చుకున్నారు కదా అని ప్రస్తావించారు. కాబట్టి, వేరే రాష్ట్రాల్లో పార్టీని ఇంప్రూవ్ చేసుకోవాలని, అక్కడ డెవలప్ చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు.

Latest Videos

undefined

Also Read: మొరుసుపల్లి షర్మిల శాస్త్రి: వైఎస్ఆర్ రాజకీయ వారసత్వంపై పోరు.. వైసీపీ టార్గెట్ ఇదేనా?

ఇంకో పది ఏండ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది.. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే వేరే రాష్ట్రానికి వెళ్లి పోటీ చేసి అవ్వాలి - బండ్ల గణేష్ pic.twitter.com/GQXrIaFksR

— Telugu Scribe (@TeluguScribe)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే. సీపీఎం మద్దతుతో మొత్తం 65 మంది శాసన సభ్యులతో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. రెండు సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ స్వల్ప సీట్ల తేడాతో ప్రతిపక్షానికి పరిమితమైంది. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి మాజీ సీఎం కేసీఆర్ ఇంకా బయటికి రాలేదు. తుంటికి సర్జరీ కావడంతో ఇంకా ఆయన అసెంబ్లీకి రాలేదు.. ప్రజలనూ కలువలేదు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కేసీఆర్ ఎంట్రీని గ్రాండ్‌గా తీర్చిదిద్దే పనిలో ఉన్నది. లోక్ సభ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెడుతున్నది.

click me!