తమిళిసైపై వివాదాస్పద వ్యాఖ్యలు: జాతీయ మహిళా కమిషన్ ముందుకు కౌశిక్ రెడ్డి

Published : Feb 21, 2023, 12:05 PM ISTUpdated : Feb 21, 2023, 12:19 PM IST
తమిళిసైపై వివాదాస్పద వ్యాఖ్యలు: జాతీయ మహిళా కమిషన్ ముందుకు కౌశిక్ రెడ్డి

సారాంశం

జాతీయ మహిళా కమిషన్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు  జారీ చేసింది. ఈ నోటీసులు అందుకున్న  కౌశిక్ రెడ్డి  ఇవాళ  మహిళా కమిషన్ ముందు  హజరయ్యారు.

న్యూఢిల్లీ:  జాతీయ మహిళా కమిషన్ ముందు  బీఆర్ఎస్  ఎమ్మెల్సీ  కౌశిక్ రెడ్డి  మంగళవారం నాడు హజరయ్యారు.   తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై  కౌశిక్ రెడ్డి  వివాదాస్పద వ్యాఖ్యలను  జాతీయ మహిళా కమిషన్  సుమోటోగా తీసుకుంది.  ఈ విషయమై  కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. 

గవర్నర్ తమిళిసై సౌందర రాజన్  తన వద్దే  బిల్లులు పెట్టుకోవడంపై  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కౌశిక్ రెడ్డి  వివామాదస్పద వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై  కౌశిక్ రెడ్డిపై  చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు  కూడా  పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సీరియస్ గా తీసుకుంది.  ఈ వ్యాఖ్యలపై   జాతీయ మహిళా కమిషన్  నోటీసు జారీ చేసింది.  ఇవాళ  ఉదయం  11:30 గంటలకు తమ ముందు  హజరు కావాలని  జాతీయ మహిళా  కమిషన్ ఆదేశించింది. ఈ నోటీస్  అందుకున్న  కౌశిక్ రెడ్డి  నిన్న రాత్రి  న్యూఢిల్లీకి చేరుకున్నారు.  ఇవాళ  ఉదయం  జాతీయ మహిళా కమిషన్ కార్యాలయానికి  చేరుకున్నారు.

ఈ ఏడాది జనవరి 26వ తేదీన గవర్నర్  తమిళిసై  సౌందరరాజన్ పై  ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు  చేశారు.  ఈ వ్యాఖ్యలపై  సరూర్ నగర్ కార్పోరేటర్, బీజేపీ నేత  శ్రీవాణి  సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు  చేశారు. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?