ఢిల్లీ లిక్కర్ స్కాం .. ముగిసిన కవిత ఈడీ విచారణ, సెల్‌ఫోన్‌లపైనే ప్రశ్నల వర్షం

Siva Kodati |  
Published : Mar 21, 2023, 09:48 PM ISTUpdated : Mar 21, 2023, 10:10 PM IST
ఢిల్లీ లిక్కర్ స్కాం .. ముగిసిన కవిత ఈడీ విచారణ, సెల్‌ఫోన్‌లపైనే ప్రశ్నల వర్షం

సారాంశం

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ముగిసింది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు కవిత ఈడీ ఆఫీసుకు విచారణ కోసం వచ్చారు. దాదాపు పది గంటల పాటు ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ముగిసింది. మంగళవారం దాదాపు పది గంటల పాటు ఆమెను ఈడీ అధికారులు విచారించారు. అయితే సాయంత్రం ఈడీ ఆఫీస్ నుంచి కవిత న్యాయవాది సోమా భరత్‌కు పిలుపు రావడంతో ఆయన కార్యాలయానికి చేరుకున్నారు. భరత్‌తో పాటు బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్ కూడా వున్నారు. ఈ సందర్భంగా ఈడీ అడిగిన సమాచారాన్ని సోమా భరత్ తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. దీంతో ఈడీ కార్యాలయం వద్దకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. అనంతరం రాత్రి 9.44 గంటలకు కవిత ఈడీ కార్యాలయంలోని గేట్ నెం 3 నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా  అక్కడ ఉన్న కార్యకర్తలకు, మీడియాకు అభివాదం చేస్తూ కారులో ముందుకు సాగారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు కవిత ఈడీ ఆఫీసుకు విచారణ కోసం వచ్చారు. ఈ రోజు ప్రధానంగా మొబైల్ ఫోన్లపై ప్రశ్నలు అడిగినట్టు సమాచారం.

ALso REad: ఈడీ నుంచి కవిత లీగల్ టీమ్‌కు పిలుపు .. ఆగమేఘాల మీద చేరుకున్న సోమా భరత్

కాగా.. అంతకుముందు ఢిల్లీలోని కేసీఆర్ నివాసం నుంచి ఉదయం ఈడీ కార్యాలయానికి బయలుదేరిన సమయంలో.. కవిత తన కారులో నుంచి బయటకు వచ్చి కవర్‌లలో ప్యాక్ చేసి ఉన్న తన ఫోన్‌లను మీడియా ఎదుట ప్రదర్శించారు. అనంతరం ఈడీ కార్యాలయానికి కవిత చేరుకున్నారు. ఈడీ కార్యాలయం వద్ద కూడా కవిత మరోసారి తన ఫోన్లను మీడియా  ముందు ప్రదర్శించారు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే రెండు సార్లు కవితను విచారించిన ఈడీ అధికారులు.. నేడు  మరోసారి విచారించారు. తొలుత ఈ నెల 11న కవితను దాదాపు 8 గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు.. సోమవారం దాదాపు 10 గంటలకు పైగా ఆమెను ప్రశ్నించారు. నిన్న రాత్రి 9 గంటల తర్వాత కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. 

మరోవైపు.. ఈడీకి  మంగళవారంనాడు  కవిత   లేఖ  రాశారు. తనను  రాజకీయ కోణంలోనే  విచారణ  చేస్తున్నారని  ఈడీకి  రాసిన  లేఖలో  కవిత పేర్కొన్నారు. తనపై ఈడీ తప్పుడు ప్రచారం చేస్తుందని  ఆ లేఖలో  కవిత  ఆరోపించారు.   గతంలో  తాను  ఉపయోగించిన  అన్ని  ఫోన్లను  ఈడీకి అందిస్తున్నానని  కవిత  ఆ లేఖలో  పేర్కొన్నారు. తాను  ఫోన్లను ధ్వంసం చేశానని  తప్పుడు ప్రచారం చేశారని  కవిత ఆ లేఖలో  పేర్కొన్నారు. ఏ ఉద్దేశ్యంతో  ఇలా  చేశారని ఆమె  ప్రశ్నించారు. మహిళ  ఫోన్లను  స్వాధీనం  చేసుకోవడం స్వేచ్ఛకు భంగం కల్గించడమేనని  కవిత  పేర్కొన్నారు. ఫోన్ల విషయంలో  కనీసం  సమన్లు  కూడా  ఇవ్వలేదని  కవిత  గుర్తు  చేశారు.  2022 నంబర్ మాసంలోనే  తాను  ఫోన్లను  ధ్వంసం చేసినట్టుగా  తప్పుడు  ప్రచారం చేశారని  కవిత ఆ లేఖలో  పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం  విచారణకు  సహకరిస్తున్నట్టుగా  కవిత  ఆ లేఖలో   ప్రస్తావించారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్