నేడు ఢిల్లీకి కల్వకుంట్ల కవిత: రేపు ఈడీ విచారణకు హాజరుపై ఉత్కంఠ

By narsimha lode  |  First Published Mar 19, 2023, 3:53 PM IST

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  సోమవారంనాడు ఈడీ విచారణకు  హాజరౌతారా లేదా  అనేది సర్వత్రా ఉత్కంఠ  నెలకొంది.  


హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత  ఆదివారంనాడు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు.  రేపు ఈడీ విచారణకు  రావాలని నోటీసులు జారీ  చేసినందున  కవిత ఢీల్లీ పర్యటన  ప్రాధాన్యత  సంతరించుకుంది. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఈ నెల  16న ఈడీ విచారణకు  కవిత హాజరుకాలేదు. రేపు మరోసారి విచారణకు  రావాలని  ఈడీ  నోటీసులు జారీ  చేసింది.  మరో వైపు  కవిత  సుప్రీంకోర్టులో దాఖలు  చేసిన  పిటిషన్ పై  ఈడీ  అధికారులు  సుప్రీంకోర్టులో  కేవీయట్  పిటిషన్ దాఖలు  చేశారు.

Latest Videos

undefined

సుప్రీంకోర్టులో  తాను దాఖలు  చేసిన పిటిషన్   పై ఈ నెల  24వ తేదీన  విచారణ జరగనుందని కవిత ెలిపారు.  అయితే  ఈ పిటిషన్ పై  సుప్రీంకోర్టు తీర్పు  తర్వాత విచారణకు హజరు కానున్నట్టుగా  కవిత తెలిపారు.ఈ మేరకు  ఈ నెల  16న  బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ ద్వారా  ఈడీకి  లేఖ  పంపారు.  అయినా కూడా  ఈ నెల  20వ తేదీనే విచారణకు  హాజరు కావాలని  కవితకు  ఈడీ అధికారులు సమన్లు  పంపారు. అయితే  రేపు ఈడీ విచారణకు  కవిత  హాజరౌతారా లేదా  అనేది  ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెల  16వ తేదీ మాదిరిగా  తన తరపున  న్యాయవాదితో  సమాచారం  పంపుతారా  అనే విషయమై  ఇంకా  స్పష్టత రాలేదు. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  అరుణ్ రామచంద్రపిళ్లై కస్టడీని  ఈ నెల  20వరకు  ఈడీ కస్టడీ  పొడిగించింది  కోర్టు.  అరుణ్ రామచంద్ర పిళ్లైతో పాటు కవితను  కలిపి  విచారిచే అవకాశం లేకపోలేదు.  వైసీపీ ఎంపీ  మాగుంట శ్రీనివాసులు  రెడ్డిని  కూడా ఈడీ అధికారులు విచారణకు  పిలిచారు.  కానీ ఈ నెల  18న మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈడీ విచారణకు హాజరు కాలేదు. 

ఢిల్లీ మాజీ  డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఇతరులతో  కలిపి విచారించాలని ఈడీ  భావిస్తుంది.  దీంతో  మనీష్ సిసోడియాకు  కూడా  ఈడీ కస్టడీని  కోర్టు  పొడిగించింది. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  సౌత్ గ్రూప్ కీలకంగా  వ్యవహరించిందని దర్యాప్తు సంస్థలు  ఆరోపిస్తున్నాయి. సౌత్ గ్రూప్ లో  ఎవరెవరు కీలకంగా  వ్యవహరించారనే విషయమై  దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి. 
 

click me!