న్యూఢిల్లీ నుండి హైద్రాబాద్ బయలుదేరిన కవిత

Published : Mar 22, 2023, 10:24 AM ISTUpdated : Mar 22, 2023, 10:52 AM IST
న్యూఢిల్లీ నుండి హైద్రాబాద్ బయలుదేరిన  కవిత

సారాంశం

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత  న్యూఢిల్లీ నుండి  హైద్రాబాద్ కు  బయలుదేరారు . నిన్న, మొన్న రెండు రోజుల పాటు  కవిత  ఈడీ విచారణను  ఎదుర్కొన్న విషయం తెలిసిందే. 

 

న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  న్యూఢిల్లీ నుండి బుధవారంనాడు  ఉదయం  హైద్రాబాద్ కు  బయలుదేరారు.   మంగళవారంనాడు  రాత్రి  9:40 గంటల వరకు  ఈడీ  అధికారులు  కవితను విచారించిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని సీఎం కేసీఆర్ అధికారిక  నివాసం నుండి  కారులో  వెళ్తూ  మీడియా ప్రతినిధులకు కవిత  ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

బీఆర్ఎస్  ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత  ఈ నెల  19వ తేదీన  హైద్రాబాద్ నుండి  న్యూఢిల్లీకి చేరుకున్నారు.  ఎమ్మెల్సీ కవిత  వెంట  మంత్రి  కేటీఆర్, ఎంపీ సంతోష్, కిత  భర్త అనిల్ కూడా  ఢిల్లీకి వచ్చారు.  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఈ నెల  20, 21 తేదీత్లో  కవిత  ఈడీ విచారణను  ఎదుర్కొన్నారు.  ఈ నెల  20వ తేదీన  పదిన్నర గంటల పాటు  ఈడీ  అధికారులు కవితను విచారించారు. ఈ నెల  21న  సుమారు  పది గంటల పాటు  కవితను  విచారించారు. నిన్న కవితను 15 అంశాలపై  ఈడీ అధికారులు  ప్రశ్నించారు.  మొన్న  14 అంశాలపై  ఈడీ అధికారులు  ప్రశ్నల వర్షం కురిపించారని సమాచారం. ఈ నెల  11వ తేదీన  తొలిసారిగా  కవిత ఈడీ విచారణకు  హాజరయ్యారు.ఈ నెల  20న రెండో  దఫా, ఈ నెల  21న  మూడో సారి  ఈడీ విచారణకు హాజరయ్యారు.  

also read:గతంలోనూ పేపర్లు లీకయ్యాయి.. అవి సాధారణమే - మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ఈ నెల  6వ తేదీన  అరుణ్   రామచంద్రపిళ్లైని  ఈడీ అధికారులు  అరెస్ట్  చేశారు. అరుణ్ రామచంద్ర పిళ్లై  ఇచ్చిన వాంగ్మూలం మేరకు  ఈడీ అధికారులు కవితకు    నోటీసులు ఇచ్చారు. ఈ నెల  8వ తేదీన కవితకు  ఈడీ అధికారులు నోటీసులు  జారీ చేశారు.ఈ నెల  9వ తేదీన  విచారణకు  రావాలని  కోరారు. అయితే  ముందుగా  ప్లాన్  చేసుకున్న కార్యక్రమాలు  ఉన్నందున విచారణకు  రాలేనని  కవిత ఈడీకి లేఖ  రాశారు.

ఈ నెల  11న ఈడీ విచారణకు  కవిత  హాజరయ్యారు. ఈ నెల  16న  విచారణకు  రావాలని కవితకు ఈడీ అధికారులు  నోటీసులు  పంపారు.  అయితే  ఈ నెల  15న ఢిల్లీకి  చేరుకున్నప్పటికీ  ఈ నెల  16న ఈడీ విచారణకు  కవిత హాజరు కాలేదు.  ఈడీ అడిగిన సమాచారాన్ని కవిత  బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి  సోమా భరత్ ద్వారా పంపారు.

 ఈడీ విచారణపై తాను  దాఖలు  చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈనెల  24న విచారించనున్నందున  అప్పటివరకు  విచారణకు  రాలేనని  కవిత  ఈడీకి  భరత్  ద్వారా లేఖ పంపారు. కానీ  ఈ నెల  20న విచారణకు  రావాలని  కవితకు  ఈడీ అధికారులు  నోటీసులు జారీ చేయడంతో  విచారణకు  కవిత  హాజరు కావాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. 
 

PREV
click me!

Recommended Stories

THROWBACK : అసెంబ్లీలో కేసీఆర్ Vs రేవంత్ రెడ్డి | KCR VS Revanth Reddy In Telangana Assembly
BIG BREAKING: మహిళా MLA అని కూడా చూడకుండా.. అసెంబ్లీ వద్ద తీవ్ర రచ్చ! 🚨